సూర్యపేట జల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మఠంపల్లి మండలంలో ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిని కర్రలతో చితకబాదారు బీఆర్ఎస్ కు చెందిన వ్యక్తులు. కాంగ్రెస్ వాళ్లు ఓటు వేసేందుకు వస్తే చంపుతామంటు బెదిరింపులకు దిగుతున్నారని బాధితుడు వాపోయాడు. ఈ దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... మఠంపల్లి మండల కేంద్రంలోని యుపిఎస్ పాఠశాల వద్ద ఓటు గాదె నవీన్ అనే వ్యక్తి వెళ్లాడు. బైక్ వాళ్ల బంధువులను ఓటు వేసేందుకు తీసుకెళ్లాడు. బైక్ దిగగానే ఎమ్మెల్యే సైదిరెడ్డి మేనమామ శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులు 20 మంది ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్తావా అంటూ నవీన్ ను కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారని బాధితుడు తెలిపాడు. అక్కడున్నవారంతా ఆపేందుకు ప్రయత్నించడంతో దగ్గరకు వస్తే చంపుతామని బెది అక్కడున్న ప్రజలు ఆపటానికి ప్రయత్నించిన వారిని సైతం దగ్గరకొస్తే చంపుతామని బెదిరించినట్లు తెలిపాడు. కర్రలతో కొడుతున్నప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు వేసేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీస్ అధికారులు వెంటనే కలగజేసుకుని ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా పోలింగ్ సరళి సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: ఓటు వేసాక…పొరపాటున ఈ పని చేయకండి…చేశారో అరెస్ట్ తప్పదు..!!