Janagama: జనగామ జిల్లాలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. పరిస్థితి ఉద్రిక్తం.. 

తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. జనగామ జిల్లాలో ధ్రమకంచ గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ వర్గీయులకు, కాంగ్రెస్ వర్గీయులకు మధ్య ఘర్షణ పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

Janagama: జనగామ జిల్లాలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. పరిస్థితి ఉద్రిక్తం.. 
New Update

Janagama: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ చిన్న, చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతోంది. అయితే, జనగామ జిల్లాలో బీఆర్ఎస్ వర్గీయులకు.. కాంగ్రెస్ వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 263 పోలింగ్ బూత్ వద్ద పోలింగ్ సరళిని పరిశీలించేందుకు యువజన కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. అయితే, అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఏజెంట్ ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Janagama: పరిస్థితి అదుపుతప్పకుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇరువురినీ అక్కడనుంచి పంపించేందుకు చూశారు. ఈ క్రమంలో ఏసీపీ అంకిత్, ఎమ్మెల్యే పల్లాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. 

#janagama
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe