Fire Accident: టపాసుల గోడౌన్ లో భారీ పేలుడు..పది మంది మృతి! తమిళనాడులో మరోసారి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మధ్య కాలంలో ఇలా పేలుడు సంభవించడం ఇది మూడో సారి. By Bhavana 18 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి తమిళనాడు (Tamilanadu) లో మరోసారి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం (FIRE ACCIDENT) చోటు చేసుకోవడంతో 10 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మధ్య కాలంలో ఇలా పేలుడు సంభవించడం ఇది మూడో సారి. గ్రామ శివార్లో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రం, దానికి అనుకొని ఉన్న విక్రయ కేంద్రంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శివకాశీ తాలూకా..రెంగపాలయం గ్రామంలో కనిష్కర్ ఫైర్ వర్క్స్ పేరుతో ఒక బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. దీపావళి పర్వదినం దగ్గర పడుతుండడంతో పెద్ద సంఖ్యలో బాణాసంచా తయారు చేసి నిల్వ ఉంచారు. Also read: పగటి వెలుగుతో టైప్ 2 మధుమేహనికి చెక్! ఈ క్రమంలోనే కొంతమంది టపాసులు కొనుగోలు చేసి షాపు ముందే కాల్చారు. ఈ క్రమంలో కొన్ని టపాసులు షాపు లోనికి దూసుకు వెళ్లాయి. దీంతో షాపులో ఉన్న బాణాసంచా ఒక్కసారిగా కాలిపోవడంతో పాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో షాపు తో పాటు వెనుక ఉన్న గోడౌన్ లోని బాణాసంచా కూడా కాలిపోయింది. సుమారు గంట పాటు ఈ పేలుళ్లు సంభవించాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. వారు మంటలను అదుపు చేస్తున్న క్రమంలో ఫ్యాక్టరీలో మరో భారీ పేలుడు జరిగింది. దీంతో అక్కడ పని చేస్తున్న పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. Also read: పోలీసు స్టేషన్ కి తాళం వేసిన మహిళ..సమస్య పరిష్కరించడం లేదని వినూత్న నిరసన! పదుల సంఖ్యలో కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also read: నాకు ఈ భర్త వద్దు నాన్న..మేళతాళాలతో స్వాగతం పలికిన పుట్టింటి వారు! #fire-accident #tamilanadu #tapasulu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి