AP Temperatures: ఏపీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు భారీ వర్షాలు పడగా నిన్నటి నుంచి మళ్లీ ఎండల తీవ్రత మొదలైంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ ప్రభావం చూపుతుందంటున్నారు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్.
Also Read: రెమాల్ విధ్వంసం.. మిజోరం, అస్సాంపై ప్రతాపం చూపిస్తున్న తుపాను..!
తిరుపతి జిల్లా సత్యవేడులో 41.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లా మనుబోలులో 41.5 డిగ్రీలు, బాపట్ల జిల్లా వేమూరు, కృష్ణా జిల్లా పెడనలో 40.9 అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: తల్లి పాలను విక్రయిస్తే అంతే.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వార్నింగ్..!
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది. ఈ క్రమంలో పలు ప్రాంతాలవైపు తుఫాన్ దిశగా పొడి గాలులు వీస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల వైపు తీవ్రమైన వేడిగాలులు, ఎండ తీవ్రత, రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత కొనసాగుతుందని.. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.