Winter effect: తెలంగాణ వణుకుతోంది.. చ‌లి పంజాకు జ‌నం గజగజ

రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ట్రోగ‌త‌లు తీవ్రస్థాయిలో ప‌డిపోతున్నాయి. చలి పంజా విసరడంతో జనం గజగజ వణికిపోతున్నారు. ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు చ‌లి తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

New Update
Winter effect: తెలంగాణ వణుకుతోంది.. చ‌లి పంజాకు జ‌నం గజగజ

Winter effect: తెలంగాణ వణుకుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ట్రోగ‌త‌లు తీవ్రస్థాయిలో ప‌డిపోతున్నాయి. చలి పంజా విసరడంతో జనం గజగజ వణికిపోతున్నారు. ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు చ‌లి తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఈశాన్య , వాయ‌వ్య భార‌త్ నుంచి వీస్తున్న గాలుల‌తో క‌నిష్ట, గ‌రిష్ట ఉష్ణోగ్రత‌లు త‌గ్గిపోతున్నాయి. ఇక వికారాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు ప‌డిపోతున్నాయి. ద‌ట్టమైన పొగ మంచుతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బంద‌లు ఎద‌ర్కొంటున్నారు.తెలంగాణ‌లోని ఉమ్మడి ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత‌లు ప‌డిపోతున్నాయి. మ‌రోవైపు హైద‌రాబాద్‌లోనూ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు చ‌లిగాలులు వ‌ణుకుపుట్టిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఎన్ఐఏ దాడుల్లో నివ్వెరపోయే విషయాలు.. భారీ పేలుళ్లకు ఉగ్ర కుట్ర.. 8 మంది అరెస్టు

హైదరాబాద్లో క‌నిష్ఠ ఉష్ణోగ్రత 18.6 డిగ్రీలుగా న‌మోదైంది. అటు రంగారెడ్డి జిల్లాలో 15.7 డిగ్రీలు, మేడ్చల్ జిల్లాలో 16.5 డిగ్రీల క‌నిష్ఠ ఉష్ణోగ్రతలు న‌మోదయ్యాయి. గ‌రిష్ఠ ఉష్ణోగ్రత‌లు 24 డిగ్రీల‌కు మించి ఉండ‌డం లేద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. క‌నిష్ఠ, గ‌రిష్ట ఉష్ణోగ్రత‌ల మ‌ధ్య వ్యత్యాసం నాలుగైదు డిగ్రీల‌కు మించి దాట‌టం లేద‌ని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రత‌లు మ‌రింత త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయని వాతావ‌ర‌ణశాఖ వెల్లడించింది. గ‌తంలో ఇంత‌టి స్థాయిలో ఉష్ణోగ్రత‌లు ప‌డిపోవ‌డం జ‌ర‌గ‌లేదని తెలిపారు.

ఇది కూడా చదవండి: బురిడీ నారాయణ పరార్?.. దొంగ పాస్ పోర్ట్‎తో దుబాయ్ చెక్కేశాడా!

చ‌లి పంజా దెబ్బకు ప్రజలు, ఉద‌యం పూట ప‌నుల్లోకి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రోవైపు క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ ప్రజలు అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు వైద్యులు. వాతావ‌రణంలో మార్పులు కార‌ణంగా అనారోగ్య స‌మ‌స్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌న్నారు. తీవ్రమైన చ‌లిగాలుల కార‌ణంగా శ‌ర‌రీంలో ఉష్ణోగ్రత‌లు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు