Devil: ఆ సినిమా దర్శకుడు ఏమయ్యాడు..? By Vijaya Nimma 13 Sep 2023 in సినిమా New Update షేర్ చేయండి సినిమాకు నిర్మాతలు మారడం సహజం. కానీ దర్శకులు మారడం మాత్రం అసహజం. చాలా అరుదుగా మాత్రమే సినిమాలకు దర్శకులు మారుతుంటారు. ఇది కూడా అలాంటి అరుదైన ఘటనే. కల్యాణ్ రామ్ హీరోగా త్వరలోనే రిలీజ్ కాబోతోంది డెవిల్ అనే సినిమా. అంతలోనే ఈ సినిమాకు దర్శకుడు మారిపోయాడు. ఏకంగా అతడ్ని తొలిగించి, నిర్మాతే దర్శకుడి టైటిల్ వేసుకున్న సందర్భం ఇది. వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. ‘డెవిల్’ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఆయన ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్ రామ్ ఆకట్టుకోబోతున్నారు. గత ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది ‘డెవిల్’తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు. సినిమాకు సంబంధించి తాజాగా హీరోయిన్ సంయుక్త మీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో నిర్మాతగా అభిషేక్ నామా పేరు పడింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దర్శకుడిగా కూడా అతడి పేరే పడింది. ఈ సినిమాకు అసలైన దర్శకుడు నవీన్ మేడారం. దాదాపు సినిమా అంతా అతడే పూర్తి చేశాడు. కానీ ఊహించిన విధంగా ఆఖరి నిమిషంలో తప్పుకున్నాడు. దర్శకుడు-నిర్మాతకు మధ్య ఏం జరిగిందనే విషయాన్ని పక్కనపెడితే.. డెవిల్ ప్రాజెక్టుతో నవీన్ మేడారంకు సంబంధం లేదని మాత్రం వాస్తవం. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాను ఫేస్ చేయబోతున్నాడు నిర్మాత అభిషేక్ నామా. అప్పుడు ఈ అంశంపై స్పందిస్తాడేమో చూడాలి. #what-happened #movie-devil-director #tollywood-hero-nandamuri-kalyan-ram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి