నా ఆస్తంతా మోదీకే రాసిస్తా'.. వందేళ్ల బామ్మ ఎమోషనల్!!

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వందేళ్ల వృద్ధురాలు తన 25 ఎకరాల ఆస్తిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసి ఇవ్వనున్నట్లు తెలిపింది. మోదీని తన 15వ కుమారుడిగా భావిస్తానని చెబుతోంది. వివరాల్లోకి వెళితే.. మంగీభాయి తన్వర్ అనే వృద్దురాలు.. మధ్యప్రదేశ్​ రాజ్‌గఢ్‌ జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో హరిపుర గ్రామంలో నివసిస్తోంది.

నా ఆస్తంతా మోదీకే రాసిస్తా'.. వందేళ్ల బామ్మ ఎమోషనల్!!
New Update

telugu-telangana-bharat-madhya-pradesh-old-woman-announced-to-transfer-her-25-acres-of-her-asset-to-pm-modi

మధ్యప్రదేశ్​ రాష్టం రాజ్‌గఢ్‌ జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలోని హరిపుర గ్రామంలో నివసిస్తోన్న మంగీభాయికి 14 మంది సంతానం. ప్రధాని నరేంద్ర మోదీ.. దేశానికి సేవ చేస్తున్నారని, అలాగే తనకు కూడా ఎన్నో పథకాలు అందిస్తున్నారని మంగీభాయి తెలిపింది. ఆయన పేదలకు ఆహార, గృహ వసతి కల్పిస్తున్నారని పేర్కొంది. తనతో పాటు దేశంలోని ఎందరో వృద్దుల అవసరాలు మోదీ తీరుస్తున్నారని పేర్కొంది. తనతో పాటు దేశంలోని ఎందరో వృద్దుల అవసరాలు మోదీ తీరుస్తున్నారని బామ్మ చెప్పుకొచ్చింది. అందుకే మోదీని తన 15వ కుమారుడిగా భావిస్తూ.. తన 25 ఎకరాల ఆస్తిని ప్రధాని పేరున రాసి ఇవ్వనున్నట్లు మంగీభాయ్ స్పష్టం చేసింది.

అయితే.. ప్రధాని మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ పలు అభివృద్ది పనుల్లో భాగంగా... మధ్యప్రదేశ్‌ రైల్వే స్టేషన్‌లో ఐదు వందేభారత్ రైళ్లను, రక్తహీనతకు సంబంధించిన హెల్త్ సెంటర్‌ని ప్రారంభించనున్నారు. మంగళవారం ఉదయం రైల్వే స్టేషన్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఐదు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అక్కడే బస చేసి పలువురు బీజేపీ పార్టీ నేతలతో అభివృద్ది పనుల గురించి గంట సేపు ముచ్చటించనున్నారు. అయితే ఇదిలా ఉంటే... మధ్యప్రదేశ్‌కు చెందిన వృద్దురాలు తన కొడుకుగా భావించి తన ఆస్తినంతా మోదీకి రాసిస్తాననడంతో సంచలనంగా మారింది.

మోదీకి 15 కిలోల వెండి ఇటుక బహుమానం:

telugu-telangana-bharat-madhya-pradesh-old-woman-announced-to-transfer-her-25-acres-of-her-asset-to-pm-modi

గతంలో విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ కోసం కర్నాటకలోని దావణగెరెకు వచ్చిన ప్రధాని మోదీకి.... ప్రత్యేక కానుకగా అందించారు. 15 కిలోల వెండితో తయారు చేయించారు. 11 లక్షలతో పూణెలో ప్రత్యేకంగా బీజేపీ నేతలు చేయించారు. ఆ ఇటుకపై నాలుగు దిక్కులు.. నాలుగు ఆకృతులను చెక్కారు. ఓ వైపు శ్రీరాముని ప్రతిమ.. మరోవైపు అయోధ్య రామ మందిరం.. మిగతా రెండు వైపుల్లో... జై శ్రీరామ నామం, కమలం గుర్తు ఉంది. వీటితో పాటు 1990లో జరిగిన రామజ్యోతి యాత్ర సమీపంలో చనిపోయిన 8 మంది పేర్లు దీనిపై చెక్కారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe