BRS minister supports CBN: చంద్రబాబుకు మద్దతుగా మరో బీఆర్‌ఎస్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరుగుతోంది?

చంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుపై బీఆర్‌ఎస్‌ నేతల స్పందన ఎప్పటికప్పుడూ మారుతూ వస్తోంది. ఏపీ రాజకీయాలతో తమకు పని లేదని కేటీఆర్‌ వ్యాఖ్యలు చేసిన వారం గడవకముందే మంత్రి హరీశ్‌రావు చంద్రబాబుకు సపోర్ట్‌గా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చంద్రబాబుకు మద్దతుగా ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడి తీరు పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమన్నారు తలసాని.

New Update
BRS minister supports CBN: చంద్రబాబుకు మద్దతుగా మరో బీఆర్‌ఎస్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరుగుతోంది?

ఏపీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్‌ ఆఫ్‌ ది టూ స్టెట్స్‌గా మారింది. చంద్రబాబు చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌తో తెలంగాణకు ఏం సంబంధం లేదని బీఆర్‌ఎస్‌ పెద్దలు పైకి చెప్పుకుంటున్నా.. మరికొంతమంది మంత్రులు మాత్రం ఈ మేటర్‌లో ఇన్‌వాల్వ్‌ అవుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు గతంలో క్లోజ్‌గా ఉన్న ప్రస్తుత బీఆర్‌ఎస్‌ మంత్రులు ఇప్పుడు బహిరంగంగా టీడీపీ అధినేతకు సపోర్ట్ చేస్తున్నారు. గతంలో టీడీపీలో ఉండి.. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు చంద్రబాబుకు సపోర్ట్ ఇస్తున్నారు. కొంతమంది ర్యాలీల్లో కూడా పాల్గొన్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌(Talasani srinivas yadav) చంద్రబాబుకు సపోర్ట్‌గా ఓ ట్వీట్ పెట్టారు.

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL: మరిన్ని ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ కావాలా? ఆర్టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేసి వార్తలను చూడండి

తలసాని ఏం ట్వీట్ చేశారంటే?
'మాజీ ముఖ్యమంత్రి, TDP అధినేత @ncbn గారి అరెస్ట్ చాలా బాధాకరం. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను... వారి అరెస్ట్ వ్యక్తిగతంగా నాకెంతో బాధను కలగచేసింది. అధికారం శాశ్వతం కాదు....ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడి గారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం. సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. @naralokesh' అని ట్వీట్ చేశారు.


గతంలో కేటీఆర్‌ ఏం అన్నారు?
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించేందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారం క్రితం నిరాకరించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు వ్యవహారం రెండు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం అని.. దాని పర్యవసానం తెలంగాణలోనూ, ఇక్కడి ప్రజల్లోనూ లేదన్నారు కేటీఆర్‌. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న ఐటీ ఉద్యోగులను హైదరాబాద్ లో ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించగా.. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కార్యక్రమం కోసం తెలంగాణలో ర్యాలీలు ఎలా నిర్వహిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని కేటీఆర్ అన్నారు. నారా లోకేశ్‌, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అందరూ తన స్నేహితులేనని.. తటస్థంగా ఉంటామని చెప్పారు. అటు హరీశ్‌రావు మాత్రం చంద్రబాబు అరెస్ట్‌ని ఖండించినట్టుగా మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. ఇలా బీఆర్‌ఎస్‌ నేతల టోన్‌ ఎప్పటికప్పుడూ మారుతూ వస్తోంది. చంద్రబాబు విషయంలో బీఆర్‌ఎస్‌ వైఖరిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.

ALSO READ: తెలంగాణలో మరో మూడు కొత్త మండలాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేసీఆర్ సర్కార్

Advertisment
తాజా కథనాలు