Prakasam: సైరా నరసింహారెడ్డికి.. ప్రకాశం జిల్లాకి ఉన్న సంబంధం ఇదే..!! ఉరి కొయ్యలనే ఉయ్యాలగా మలుచుకున్న ఉయ్యాలవాడ గురించి గిద్దలూరు ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన చరిత్ర సత్యాలను వెలికి తీసింది.1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి పదేళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పాలనను ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. By Vijaya Nimma 08 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి సత్యాలు వెలికి తీత ఉరి కొయ్యలనే ఉయ్యాలగా మలుచుకున్న ఉయ్యాలవాడ గురించి గిద్దలూరు ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన చరిత్ర సత్యాలను వెలికి తీసింది.1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి పదేళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పాలనను ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.1946 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1947 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. దీపం వెలుగుతో పాలనా పాలనా పరంగా నరసింహారెడ్డి ఒకనాడు ప్రస్తుత గిద్దలూరు మండలం నరవ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడే కొద్దిసేపు సేద తీరాడు. నరసింహారెడ్డి నరసింహస్వామి కలలోకి రావడంతో పక్కనే ఉన్న 150 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై నరసింహస్వామి ఆలయం నిర్మించారు. అప్పటి నుండి నిత్యం దూప, దీప నైవద్యాల కోసం పూజారిని నియమించాడు ఉయ్యాలవాడ. కొత్తకోట నుండి నరవకొండపై ఉన్న దీపం వెలుగుతో పాలనా సాగించేవాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అప్పటి నుంచి నేటి వరకు ఒక వంశానికి చెందిన వారే పూజలు నిర్వహిస్తున్నారు. ఆనవాళ్లు ఉన్నాయి కొత్త కోటలో నరసింహారెడ్డి నిర్మించుకున్న బురుజు గ్రామస్థుల సహకారంతో బయటకి వచ్చాయి. ఆనాడు నరసింహరెడ్డి వాడిన పిరంగి పరిశీలిస్తే నరసింహారెడ్డి వాడిన ఫిరంగి టన్నుపైగా బరువు ఉన్నట్లు తెలిసింది. నరసింహారెడ్డి బురుజుపై తన రాజ్యంలోకి శత్రువులను గమనిచుటకు సెంట్రీలను కూడా ఏర్పాటు చేసుకున్న ఆనవాళ్లు కూడా కనపడుతున్నాయి. కోటలోకి ప్రవేశించాలి అంటే కోట చుట్టూ 20 అడుగుల వెడల్పుతో పెద్ద కాలువ ఉంది. సైన్యంకి ప్రజలకు తాగునీటి అవసరాల కోసం నరసింహారెడ్డి తవ్వించిన మంచినీళ్ళ బావి కూడా మనకి కనపడుతుంది. #prakasam-district #relationship-between #saira-narasimha-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి