Wayanand: వయనాడ్‌లో భయంకరమైన పరిస్థితులు.. RTVతో కేరళ వ్యక్తి తెలుగులో మాట్లాడుతూ..

వయనాడ్‌లో RTVతో ఓ కేరళ వ్యక్తి తెలుగులో మాట్లాడారు. కోజికోడ్‌ నుంచి 15 మంది వాలంటీర్‌గా వచ్చి సహాయకచర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. వయనాడ్‌లో పరిస్థితులు చూస్తే భయం వేస్తోందన్నారు. ఎంతో అందంగా ఉండే ప్రాంతం ఇలా అయిపోయిందంటే నమ్మలేకపోతున్నామన్నారు.

New Update
Wayanand: వయనాడ్‌లో భయంకరమైన పరిస్థితులు.. RTVతో కేరళ వ్యక్తి తెలుగులో మాట్లాడుతూ..

Wayanand: వయనాడ్‌లో విషాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మృతుల సంఖ్య 300 దాటిన సంగతి తెలిసిందే. గుర్తుపట్టలేని స్థితిలో 150కి పైగా డెడ్‌బాడీలు ఉన్నాయి. తలలు, కాళ్లు, చేతులు ఊడిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యమవుతున్నాయి. డెడ్‌బాడీలు ఎవరివో గుర్తుపట్టలేని దారుణ పరిస్థితి. వయనాడ్‌ అధ్వాన పరిస్థితులపై చలించిపోయిన చుట్టు పక్క గ్రామణ ప్రజలు వాలంటీర్లగా వచ్చి సహాకచర్యలు అందిస్తున్నారు.

Also Read: లెక్కల మాస్టారుగా మారిన ప్రియదర్శి.. ‘35′ సెకండ్స్ గ్లింప్స్‌

కాగా, వయనాడ్‌ విషాదకర పరిస్థితులను RTV ఎక్స్ క్లూజివ్ గా చూపిస్తోంది. ఈ క్రమంలోనే RTVతో తెలుగులో మాట్లాడారు ఓ కేరళ వ్యక్తి. అతను వాలంటీర్‌గా వచ్చి సహాయకచర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. కోజికోడ్‌ నుంచి 15 మందితో వచ్చి సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో టూరిస్టుగా చూరమల్‌కు వచ్చామని.. ఎంతో అందంగా ఉండే ప్రాంతం ఇలా అయిపోయిందంటే నమ్మలేకపోతున్నామంటున్నారు. వయనాడ్‌లో పరిస్థితులు చూస్తే భయం వేస్తోందన్నారు.

Advertisment
తాజా కథనాలు