Telugu People in Malaysia: మలేషియాలో తెలుగు ప్రజల ఇక్కట్లు.. ఆదుకోవాలని కంటతడి

పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లిన తెలంగాణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. నమ్మిన ఏజెంట్లే నిండా ముంచేశారు. ఏం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. తమను ఎలాగైనా స్వదేశానికి తీసుకెళ్లాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు.

Telugu People in Malaysia: మలేషియాలో తెలుగు ప్రజల ఇక్కట్లు.. ఆదుకోవాలని కంటతడి
New Update

Telugu People in Malaysia:

నిండా ముంచేసిన ఏజెంట్లు.. 

పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లిన కామారెడ్డి జిల్లా (Kamareddy) వాసులను ఏజెంట్లు నిండా ముంచేశారు. మూడు నెలల క్రితం ఏజెంట్ల ద్వారా మలేషియాకు వెళ్లిన తెలుగు ప్రజలు ఆ దేశంలో చిక్కుకుపోయారు. మలేషియాలో ఉద్యోగం కోసం ఒక్కో బాధితుడి నుంచి ఏజెంట్లు లక్షా 50 వేల రూపాయలు వసూలు చేశారు. తీరా మలేషియాలో అడుగుపెట్టేసరికి ఏజెంట్ల చేతిలో మోసపోయినట్లు గ్రహించి లబోదిబోమంటున్నారు బాధితులు.. తమను ఎలాగైనా స్వదేశానికి తీసుకెళ్లాలంటూ ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు.

ఆదుకోవాలని కన్నీటిపర్యంతం..

మలేషియాలో (Malaysia) ఉద్యోగవకాశాల కోసం కామారెడ్డి జిల్లాకు చెందిన 21 మంది రెండు నెలల క్రితం ఏజెంట్లను సంప్రదించారు. వీసా ప్రాసెస్‌, ఇతరత్రా డాక్యుమెంట్లలతో పాటు కమీషన్‌ నిమిత్తం ఒక్కో వ్యక్తి నుంచి లక్షా 50 వేల రూపాయలు వసూలు చేశారు. మలేషియాకు చేరుకున్న తర్వాత అక్కడి పాండియన్‌, రామలింగం అనే ఏజెంట్లు బాధితులను ఓ కాంట్రాక్టర్‌కు అమ్మేశారు. వారి చేత మూడు నెలలు వెట్టి చాకిరీ చేయింకున్న కాంట్రాక్టరు కనీసం జీతం కూడా ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. అంతేకాదు.. బాధితుల పాస్‌పోర్టులను తన దగ్గరే పెట్టుకున్న కాంట్రాక్టర్‌.. తమని చిత్రహింసలకు గురిచేశాడని బాధితులు వాపోయారు. పాస్‌పోర్టు, డబ్బులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, తమను ఎలాగైనా ఆదుకోవాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

కేంద్రమంత్రి సహాయం కోరిన తెలంగాణ సర్కార్.. 

మలేషియాలో చిక్కుకున్న 21 మందిలో ఏడుగురు భారత ఎంబసీని సంప్రదించి, తమ పరిస్థితిని అక్కడి అధికారులకు వివరించారు. ప్రస్తుతం ఈ ఏడుగురు ఇండియన్‌ ఎంబసీలోనే ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. మరోవైపు.. మలేషియాలో చిక్కుకున్న తెలుగు వారిని స్వదేశానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా... కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బి.బి. పాటిల్‌ (B. B. Patil) సహాయం కోరింది తెలంగాణ ప్రభుత్వం. మలేషియాలో చిక్కుకున్న తెలుగు వాళ్లను తిరిగి స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని కోరింది.

Also Read: అదే జరిగితే చంద్రయాన్ నాశనమైనట్టే….. బాంబు పేల్చిన ఇస్రో చైర్మన్…!

#telugu-people-in-malaysia
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe