Pawan Kalyan: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు జనసేనాని..వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ రేపు రాజమండ్రి జైలుకు వెళ్లనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలవనున్నారు. చంద్రబాబును కలిసేందుకు పవన్‌ ములాఖత్‌ తీసుకున్నారు. జైలు పరిసరాల్లో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. రేపు పవన్ రాక నేపథ్యంలో పోలీసులు మరింత భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

New Update
Pawan Kalyan: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు జనసేనాని..వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్‌

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌..రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలవనున్నారు. చంద్రబాబును కలిసేందుకు పవన్‌ ములాఖత్‌ తీసుకున్నారు. రేపు నారా లోకేష్‌ను కూడా పవన్‌ కలవనున్నారని సమాచారం. మూడు రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబును నిన్న ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కలిశారు. జైలు పరిసరాల్లో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. రేపు పవన్ రాక నేపథ్యంలో పోలీసులు మరింత భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

చంద్రబాబు అరెస్టులో ఏపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు నారా లోకేష్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని ఆయనకు సూచించారు. ఏపీ సీఎం జగన్ నియంతంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టడం జగన్ కు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని అన్నారు. ఈ నియంత పాలనపై ఐక్యంగా పోరాడుదామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. దీనికి లోకేష్ అంగీకరించారు. తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు అరెస్టును పవన్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అయిన క్షణం నుంచి టీడీపీ శ్రేణులకు అండగా నిలిచారు. జనసేన ప్రధాన కార్యాలయంలో మీడియా మీట్ నిర్వహించిన పవన్.. వైసీపీపై తాను పోరాటం చేస్తానని ధైర్యం కల్పించారు. అంతేకాదు.. సోమవారం నాడు బాబు అరెస్ట్ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయగా.. జనసేన మద్దతిచ్చింది. అదే రోజు సాయంత్రం లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి.. పవన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ను అన్నయ్య అంటూ లోకేష్ సంబోదించారు.

ఇదిలా ఉంటే.. ఈ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసు విషయమై ఢిల్లీలోని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. బాబు అక్రమ అరెస్టు, రిమాండ్ సహా తాజా పరిణామాలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. అంతేకాదు.. ఈ మొత్తం వ్యవహారంపై ఓ నివేదిక ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటు.. ఏపీలో శాంతి భద్రతల విషయాన్ని కూడా పవన్ ప్రస్తావనకు తెచ్చే అవకాశముంది. కేంద్రంలోని పెద్దలు తెలియకుండా ఏపీలో ఏమీ జరగదని.. మొత్తం బీజేపీనే ఆడిస్తోందనే ఆరోపణలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. బీజేపీ ఒకవేళ వైసీపీకి మద్దతుగా ఉండాలనుకుంటే ఆ విషయం స్పష్టంగా చెప్పేయాలని పవన్ కోరబోతున్నట్లు సమాచారం. కాగా.. ఏపీలో ఇంత జరుగుతున్నా కేంద్రంలోని పెద్దలు ఒక్కరంటే ఒక్కరూ కూడా స్పందించింది లేదు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు మొదటిసారి జైలుకెళ్లడం టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. తమ అధినాయకుడిని అన్యాయంగా కేసులో ఇరికించారంటూ టీడీపీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు