పొలంలో దొరికిన వజ్రం, రూ.25 లక్షలకు కొన్న వ్యాపారి..?

కర్నూలు జిల్లాలో ఓ మహిళకు బంగారు పంట పండిందనే చెప్పాలి. తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో ఇటీవల ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి తేనె రంగు వజ్రం లభించిందని ప్రచారం జోరుగా జరిగింది. ఈ వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.25 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు మరో రెండు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. మద్దికెర మండలం మదనంతపురం వాసి పొలంలో కలుపు తీస్తుండగా శనివారం వజ్రం దొరికినట్లు ప్రచారం సాగుతోంది.

పొలంలో దొరికిన వజ్రం, రూ.25 లక్షలకు కొన్న వ్యాపారి..?
New Update

telugu-news-viral-news-andhra-pradesh-diamond-found-kurnool-district

ఓ మహిళా రైతు పొలంలో కలుపు మొక్కలు తీసే పనుల్లో ఎవరికి వారు చేసుకుంటూ వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. ముందు రోజు రాత్రి వర్షం కురవడంతో తళతళ మెరిసే రాయి బయటకు కనిపించింది. ఇంకేముంది అదృష్ట్రం ఆమె చేయి తట్టింది. వెంటనే ఆ రాయిని తీసుకెళ్లి పెరవళిలో ఓ వ్యాపారికి చూపించగా.. వెంటనే రూ.14 లక్షలు డబ్బులు.. 2 తులాలు బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని వ్యాపారి సొంతం చేసుకున్నట్లు తెలిసింది. అంటే దాదాపు రూ.15 లక్షల వరకు రాగా.. ఒక్క రోజులోనే ఆమె లక్షాధికారి అయ్యింది.

అనంతపురం జిల్లాల్లో వజ్రాల కోసం ప్రజల వేట..

తొలకరి వర్షాలు కురవగానే కర్నూలుతో పాటుగా అనంతపురం జిల్లాల్లోని గ్రామాల్లో వజ్రాల కోసం ప్రజల వేట ప్రారంభమవుతుంది. భూమిలో నుంచి వజ్రాలు బయటపడతాయనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు పొలాలకు క్యూ కడతారు. వజ్రాల కోసం గాలిస్తుంటారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి.. అలాగే మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లి, పెరవళి, మదనంతాపురంలలో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారం ప్రజల్లో నడుస్తోంది.

వజ్రాల కొనుగోలుకు వ్యాపారులు క్యూ..

ఈ వజ్రాల కోసం కర్నూలు జిల్లాల వాళ్లే కాదు ఆ పొరుగు ఉండే జిల్లాల్లు, రాష్ట్రాల నుంచి వస్తుంటారు. పొలాల్లో తిరుగుతూ వజ్రాల వేటలో ఉంటారు. వజ్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతుంటారు. ఒకవేళ వజ్రం దొరికితే.. బరువు, రంగు, రకాన్ని బట్టి క్యారెట్లలో లెక్కకట్టి డబ్బులు చెల్లిస్తారు. ఈ వ్యాపారం అధికారికంగా జరగదనే చర్చ ఉంది. గత నెలలో మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లిలో ఓ వ్యక్తికి రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికిందని ప్రచారం జరిగిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఈసారి కూడా వజ్రాల వేటకు భారీగా జనాలు క్యూ కడతారని అక్కడివారంతా చెబుతుంటారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe