అయితే కేటీఆర్ కొడుకు హిమాన్షు ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని సుమారు కోటి రూపాయలతో కార్పొరేట్ స్థాయిలో స్కూల్‌ని చక్కగా తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ఆ స్కూలుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. పూర్తి వివరాలు లోకి వెళితే.. ఒక ప్రైవేట్ స్కూల్లో చదివే అటువంటి హిమాన్షు ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గచ్చిబౌలి కేశవనగర్ లో ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి నాకు మా తాతగారు ఆదర్శం అంటూ అందరిని ఆశ్చర్యపరిచాడు.
విద్యార్థుల సమస్యలు దగ్గరుండి అడిగి మరి తెలుసుకుని ఆ పాఠశాల బాగుకోసం దత్తత తీసుకున్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధి కోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేసి అత్యాధునిక హంగులతో ఆ పాఠశాల రూపురేఖలను మార్చి దానిని సుందరంగా తీర్చిదిద్దాడు. అయితే ఈ విషయాలను స్కూల్ హెడ్ మాస్టర్ రాములు యాదవ్ మీడియాకు వెల్లడించారు. హిమాన్షు అందించిన సహకారంతో విద్యార్థులకు మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ హాల్, ఆట స్థలం, బెంచీలు అందించామని తెలియజేశారు.
అయితే తానే నేరుగా ఆ స్కూల్‌కి పోయి ఆ కార్యక్రమంలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం హైలెట్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సీఎం మనవడు హిమాన్షు ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. జులై 12న తేదీన ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ఆ పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం హిమాన్షు మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇది చూసిన అక్కడికొచ్చిన చాలామంది ఇంత చిన్న వయసులో హిమాన్ష్ ఎంత పెద్ద మనసు చాటుకున్నాడంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.