లక్‌ అంటే నీదే భయ్యా! 30 ఏళ్లకే కోట్ల బిజినెస్..

దేనికైనా అదృష్టం ఉండాలిరా అంటుంటారు కదా మన పెద్దవాళ్లు.. అదృష్టాన్ని నమ్ముకోవడం కాదు కృషి, పట్టుదల ఉంటే సాధించందంటూ ఏమీ ఉండదని మనోడు రుజువు చేశాడు. కృషి, పట్టుదల మనిషిలో ఉంటే ఏ పనినైనా సాధించగలుగుతాం అనేందుకు ఇదొక చక్కటి ఉదాహరణ అనే చెప్పాలి. ఏదో ఒక రంగంలో మనం రాణించేందుకు అష్టకష్టాలు పడుతుంటాం. కానీ అదే రంగం అయినా.. సింగిల్ హ్యండ్ అతి తక్కువ టైంలో ఈజీగా సక్సెస్‌ను సాధిస్తూ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ 30 ఏళ్ల యువకుడు రోమన్ సైనీ..కోట్లు ఘటిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

New Update
లక్‌ అంటే నీదే భయ్యా! 30 ఏళ్లకే కోట్ల బిజినెస్..

telugu-news-national-rs-emperor-of-a-2600-crore-business-empire-this-doctor-cum-collector-roman-saini

మన పెద్దలు చెప్పినట్లు పట్టిందల్లా బంగారం అవుతుందన్నట్టు అదృష్టం అందరికి కలిసిరాదు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు. మనం ఏ పని చేసినా గట్టి సంకల్ప బలంతో చేయాలంటుంటారు. సంకల్పానికి కృషి, పట్టుదల తోడైతే అదే రంగంలోనైనా మనం సక్సెస్‌ని పొందుతాం. అలా కృషి, పట్టుదలతో సక్సెస్ సాధించిన యువకుడు మన భారతీయుడు రోమన్ సైనీ. భారతదేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతుల్లో రోమన సైనీ ఒకరు. ఆయన 18 ఏళ్ల వయసులోనే ఎంబీబీఎస్ పూర్తి చేసి..ఆ తర్వాత 22 ఏళ్లకే కలెక్టర్ జాబ్ సంపాదించి రికార్డులకు ఎక్కాడు. అంతేకాదు స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసి 30 ఏళ్లకే రూ. 2600 కోట్ల విలువైన కంపెనీలో మెయిన్ రోల్ పోశిస్తున్నాడు.

18 ఏళ్ల వయసులోనే ఎంబీబీఎస్ పూర్తి

కేవలం 16 సంవత్సారాల వయసులోనే ఎయిమ్స్ ఎంట్రన్స్ పరీక్షలో క్వాలిఫై అయి.. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తర్వాత నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్‌లో 6నెలలు పనిచేశాడు. వైద్య విద్య అనంతరం సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాడు. అతను 22 సంవత్సరాలకే యూపీపీఎస్సీ పరీక్షలో ర్యాంక్ సాధించాడు. ఇందులో మొదటిసారే ఐఏఎస్ ఆఫీసర్‌గా నియమించబడ్డాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. కలెక్టర్ విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే తన స్నేహితులతో కలిసి యూట్యూబ్‌లో సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు రోమన్ సైనీ. ఇందులో భాగంగా ‘అన్ అకాడమీ’ ఛానల్‌తో సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందించారు. దీంతో ఆ ఛానల్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది.

22 ఏళ్లకే కలెక్టర్ జాబ్

అదే టైంలో రోమన్ సైనీ ఈ ఛానల్‌ని బిజినెస్‌గా మార్చాలని అనుకున్నాడు. తను అనుకున్నదాని ప్రకారం ‘అన్ అకాడమీ’ అనే కంపెనీని స్థాపించాడు. సివిల్ సర్వీస్ అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వడమే కాకుండా ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు కూడా కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. మెయిన్‌గా జేఈఈ, నీట్, గేట్, సీఏ మొదలైన ఎగ్జామ్స్‌కు కోచింగ్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంపిటిషన్ ఎగ్జామ్స్‌తో పాటుగా రెగ్యులర్ అకాడమిక్ కోర్సులకు శిక్షణను ఇస్తున్నాడు. అంచలంచెలుగా ఎదిగి అన్ అకాడమీ కంపెనీ ప్రస్తుతం రూ. 2600 కోట్ల టర్నోవర్‌తో చరిత్రలో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకుంది. సొసైటీలో తన మార్క్‌ను పదిలం చేసుకుంటూ మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా తన బిజినెస్ కొనసాగుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు