ఇటీవలే తనను వివాదాల్లోకి లాగొద్దంటూ అనసూయ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ట్వీట్లో రాస్తూ..’వావ్! నేను నిజంగా చాలా చాలా ముఖ్యమైన వ్యక్తిని. నా పరిచయం ఉన్నా లేకున్నా.. నాకు సంబంధం ఉన్నా.. లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క చర్చ కూడా జరగడం లేదంటే.. మీ అందరికి నేను అంతలా కావాలి అబ్బాయిలు.. నాపైనే ఎక్కువగా మీరంతా ఆధారపడి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేక పోతున్నారు.’ అంటూ ఎమోజీని జత చేసింది.
పూర్తిగా చదవండి..పాపం నా పేరు లేకుండా వాళ్లు బతకలేరేమో? అనసూయ హాట్ ట్వీట్..
బుల్లితెర యాంకర్‌గా, నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచిపేరు సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఇటీవలే విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేసింది. రంగస్థలం, పుష్ప సినిమాలతో మరింత ఫేమ్ తెచ్చుకున్న అనసూయ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.
Translate this News: