ఇద్దరమ్మల కడుపు పంచుకున్న బిడ్డ: కల సాకారం చేసుకున్న స్పెయిన్ స్వలింగ జంట! ఒక బిడ్డ ఇద్దరమ్మల కడుపు పంచుకుని పుట్టాలంటే?! అదీ భిన్నమైన జైవిక స్థితిని ఎదుర్కొంటున్న స్వలింగ జంట అయితే! వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా, అలాంటి ఓ జంట ప్రాకృతికంగా అసాధ్యమైన తమ కలను ఎలా సాకారం చేసుకుందన్నదే ఈ కథనం. By Naren Kumar 20 Nov 2023 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి Viral News: పునర్జన్మ వంటి ప్రసవం అనంతరం పొత్తిళ్లలో బిడ్డను తీసుకుని మురిసిపోవడం అమ్మతనంలోని మాధుర్యం. మరి ప్రకృతి విరుద్ధమని ఇంకా మనసమాజం భావిస్తున్న సహజమైన జైవిక స్థితిని ఎదుర్కొంటున్న స్వలింగ జంట మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదించాలనుకుంటే?! అదీ ఒక బిడ్డ ఇద్దరమ్మల కడుపు పంచుకుని పుట్టాలంటే?! వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా, అలాంటి ఓ జంట ప్రాకృతికంగా అసాధ్యమైన తమ కలను ఓ శాస్త్రీయ ప్రక్రియ (invocell) ద్వారా సాకారం చేసుకుంది. ఓ పక్షం రోజుల క్రితం జరిగిందిది.. అయితే మన దగ్గర కాదు; స్పెయిన్ దేశపు మజోర్కాలో ఉన్న పాల్మా అనే చోట. చాలా మందిలాగే ఎస్టీఫానియా(30), అజహారా(27) ఓ స్వలింగ జంట. ఇద్దరూ మహిళలే. బిడ్డకు జన్మనివ్వాలనుకున్నారు, అదీ తమ బిడ్డను ఇద్దరూ తమ కడుపున మోయాలనుకున్నారు! కానీ ఎలా? తమ మాతృత్వపు ఆకాంక్ష తీరని కళే అవుతుందేమోనని సతమతమయ్యారు. ఇది కూడా చదవండి: పరగడుపున ఈ జ్యూస్‌ను తాగితే ఏమవుతుందో తెలుసా? అనేక రకాలుగా ఆలోచించి, చివరికి ఓ ఫెర్టిలిటి సెంటర్‌ను ఆశ్రయించారు. వాళ్ల కలను సాకారం చేయడానికి అక్కడి వైద్యులు ముందుకొచ్చారు. ‘ఇన్వోసెల్’ (invocell)గా పిలిచే సంతానోత్పత్తి చికిత్సను ఇందుకోసం వారు అనుసరించారు. మొదట ఎస్టీఫానియా గర్భంలో స్పెర్మ్‌ని ప్రవేశపెట్టి ఫలదీకరణం జరిగేలా చేశారు. ఒక ఐదు రోజులాగి ఆ పిండాన్ని అజహారా గర్భంలో ప్రవేశపెట్టారు. అలా నవమాసాలూ కాకపోయినా ఒకే బిడ్డను ఇద్దరూ మోశారు. వాళ్ల ప్రగాఢమైన కోరిక ఫలించి అక్టోబర్ 30న పండంటి బిడ్డ పుట్టింది. ఆ క్షణం వాళ్లకు జీవిత కాలానికి సరిపడా సంతోషాన్నిచ్చింది. ఇదే మొదటిసారి కాదు: ఐదేళ్ల క్రితం కూడా ఇలాంటి విశేషం మొదటిసారి జరిగిందట! 2018లో టెక్సాస్‌లో కూడా ఓ మహిళా జంట ఒకే బిడ్డకు మోసి జన్మనిచ్చింది. అది ఆ తరహాలో జరిగిన ప్రపంచంలోనే తొలి ప్రసవం. తర్వాత మళ్లీ ఇప్పుడు ‘ఇన్వోసెల్’ పుణ్యమా అని మరోజంట తమ ముచ్చట తీర్చుకుంది. #invocell #same-gender-couple #science-news #ivf మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి