తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మెయింటెనెన్స్ పనుల దృష్ట్యా పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. వారం రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. విజయవాడ – బిట్రగుంట (07978) రైలును జూలై 16 నుంచి 22 వరకూ రద్దు చేయగా.. బిట్రగుంట-విజయవాడ (07977), బిట్రగుంట-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (17237), చెన్నై సెంట్రల్-బిట్రగుంట (17238) రైళ్లను జూలై 17 నుంచి 23 వరకూ వారం రోజుల పాటు రద్దు చేశారు. అలానే రాజమండ్రి – విశాఖపట్నం (07466), విశాఖపట్నం-రాజమండ్రి (07467), విజయవాడ – విశాఖపట్నం (22702), విశాఖపట్నం – విజయవాడ (22701), విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ (17268), కాకినాడ పోర్ట్ – విజయవాడ (17267), విజయవాడ – గూడూరు (07500) రైళ్లను కూడా 17 నుంచి 23వ తేదీ వరకూ రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఏపీ-తెలంగాణ మధ్య రాకపోకలు జూలై 18- 24 వరకు రద్దు
గూడూరు నుంచి విజయవాడ (07458) వెళ్లే రైలును జూలై 18 నుంచి 24 వరకూ రద్దు చేసినట్లు తెలిపారు. నర్సాపూర్-గుంటూరు (17282), గుంటూరు-నర్సాపూర్ (17281) రైలును జూలై 17 నుంచి 23వ తేదీ వరకూ రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. విజయవాడ-గుంటూరు మధ్య రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. హటియా-బెంగళూరు (12835) రైలును జూలై 18న, టాటా – బెంగళూరు (12889) రైలును జూలై 21న, హటియా – బెంగళూరు (18637) రైలును 22న నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ లో పలు పనుల కారణంగా 17 నుంచి 23 వరకూ పలు రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.
తెలంగాణలో రద్దయిన రైళ్లు ఇవే..
సికింద్రాబాద్ – వరంగల్ (07462), వరంగల్ – హైదరాబాద్ (07463), సికింద్రాబాద్ – వికారాబాద్ (07591), వికారాబాద్ – కాచిగూడ (07592), కాజీపేట – డోర్నకల్ (07753), డోర్నకల్ – కాజీపేట (07754) రైళ్లను, డోర్నకల్ – విజయవాడ (07755), విజయవాడ – డోర్నకల్ (07756), భద్రాచలం – విజయవాడ (07278), విజయవాడ – భద్రాచలం (07979), కాజీపేట – సిర్పూర్ టౌన్ (17003), సిర్పూర్ టౌన్ – కరీంనగర్ (07766), నిజామాబాద్ – కరీంనగర్ (07793), కరీంనగర్ – నిజామాబాద్ (07894), బాలహర్షా – కాజీపేట (17004) రైళ్లను జూలై 23 వరకూ రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. భద్రాచలం-బాలహర్షా (17033), సిర్పూర్ టౌన్ – భద్రాచలం (17034), కాజీపేట – బల్లార్షా (17035), బాల్లార్షా – కాజీపేట (17036), కాచిగూడ – నిజామాబాద్ (07596), నిజామాబాద్ – కాచిగూడ (07593), నాందేడ్ – నిజామాబాద్ (07854), నిజామాబాద్ – నాందేడ్ (17033) రైళ్లను జూలై 17 నుంచి 23 వరకూ రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.