బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన మేఘాలతో రోజుకోలాగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. పొద్దున ఎండలు కొడుతూ సాయంత్రం పూట మాత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి రాత్రుల్లు వానలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవర్తనం కారణంగా.. మరో రెండ్రోజుల పాటూ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయవ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం మూలంగా పశ్చిమం నుంచి తెలంగాణలోకి గాలులు వేగంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్సుందని ఐఎండీ తెలిపింది.

Rain Alert: హైదరాబాద్‎కు ముసురు..దంచికొడుతున్న వాన.!!
New Update

telugu-news-ap-telangana-alert-low-pressure-form-in-bay-of-bengal-from-july-18-heavy-rains-expected-next-three-days1

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతాయని వివరించింది. ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తాలలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నేడు పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్రలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఓ పక్కా.. ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు

ఐతే.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే..అటుపక్క కుండపోత వానలు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ భారీ వరదలతో విలవిలలాడిపోతోంది. ఎన్నడూ లేని విధంగా యమున నీటిమట్టం రికార్డ్‌ స్థాయిని బ్రేక్‌ చేసి ఢిల్లీని ముంచెత్తింది. చారిత్రక కట్టడం ఎర్రకోట, రాజ్‌ఘాట్‌, సుప్రీంకోర్ట్‌, సీఎం కేజ్రీవాల్‌ నివాసం, సెక్రటేరియట్‌, మంత్రుల ఇళ్లు ఇలా కీలక ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఐతే మొన్నటివరకు మహోగ్రరూపం దాల్చిన యమున క్రమంగా శాంతిస్తోంది. ఐతే యమునకు వరద కాస్తా తగ్గినా ఢిల్లీ మాత్రం ఇంకా ముంపులోనే ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. కనీవినీ ఎరుగని రీతిలో పోటెత్తిన వరదల కారణంగా స్కూల్స్‌, కాలేజీలకు రేపటి వరకు సెలవులు ప్రకటించారు. ఢిల్లీని వరదల నుంచి కాపాడాలని..ఆర్మీ సాయం కావాలని కేంద్రాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కోరారు.

విధ్వంసం సృష్టించిన వానలు..

పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో రోడ్లు కొట్టుకుపోయాయి. రోడ్లపై భారీ గుంతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. ఇక పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వర్షాలు, వరదల ధాటికి హిమాచల్‌ ప్రదేశ్‌లో దాదాపు 100మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వర్షాల కారణంగా మనాలీ నేషనల్‌ హైవేను మూసివేశారు. అక్కడ పదుల సంఖ్యలో వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ప్రకృతి సృష్టించిన ఆ ప్రళయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఐతే మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe