పతికి పాదపూజ చేసి, విమర్శకులకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన హీరోయిన్‌

హీరోయిన్ ప్రణీత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడు అభిమానులతో సందడి చేస్తూ టచ్‌లోనే ఉంటుంది. తాజాగా.. ప్రణీత తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా..అవి కాస్త వైరల్‌ అయ్యాయి. కొంతమంది నెటిజన్స్‌ ఆమెను విమర్శిస్తూ నెగెటివ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. అలాంటి వారికి ప్రణీత గట్టి కౌంటర్‌ ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది.

New Update
పతికి పాదపూజ చేసి, విమర్శకులకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన హీరోయిన్‌

హీరోయిన్‌ ప్రణీత గురించి టాలీవుడ్ ఆడియెన్స్‌కి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మా.. ఆకట్టుకునే తన కళ్లు, అందచందాలతో తొలి మూవీతోనే మంచి ఐడెంటీటీని తెచ్చుకుంది. 'రభస', 'డైనమైట్', ‘అత్తారింటికి దారేది’లాంటి పలు చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే 2021లో వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. గతేడాది ఓ పాపకు జన్మనిచ్చింది.

ఆనవాయితీ ప్రకారం నా భర్తకు పాదపూజ

‘భీమన అమావాస్య’సందర్భంగా ఆనవాయితీ ప్రకారం... నా భర్తకు పాదపూజ చేశాను. ప్రతి ఏడాది ఇలానే చేస్తాను. ఆ ఫోటోలను షేర్‌ చేసినందుకు గతంలో కూడా నేను విమర్శలు ఎదుర్కొన్నాను. అలా నన్ను ట్రోల్‌ చేసేవారికి ఇది పితృస్వామ్య రాజ్యంలా కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం ఈ పూజ సనాతన ధర్మంలో ఒక భాగమే. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి పూజలకు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎన్నో కథలు కూడా హిందూ పురాణాల్లో ఉన్నాయి. మన సంస్కృతిలో అందరి దేవతలను ఒకేలా పూజిస్తాం’అని ప్రణీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతుంది.

స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఇలా..

భీమన అమావాస్య కన్నడ నెల ఆషాడ (జూలై - ఆగస్టు)లో చంద్రుడు లేని రోజు (అమావాస్య) నాడు జరుపుకుంటారు. ఈ రోజున మహిళలు తమ భర్తలు మరియు సోదరుల క్షేమం కోసం ప్రార్థిస్తారు. అంతేకాకుండా ఈ ఆచారాన్ని దీపస్తంభ పూజ అని కూడా పిలుస్తుంటారు. తుళునాడుకు ఇది పెద్ద పండగ అనే చెప్పాలి. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లో భీమన అమావాస్యను పెద్ద ఎత్తున జరుపుకొంటారంటూ సోషల్‌మీడియాలో తనని అడిగిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఇలా రాసుకొచ్చింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు