ఇప్పుడంతా 'ఆర్టిఫిషియల్ మాయా' లోకం..! భవిష్యత్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దేనని..మనుషులతో పని ఉండదని..ఉద్యోగాలు ఊడిపోతాయని సర్వత్రా చర్చ జరుగుతోంది. చాలా స్టార్టప్ కంపెనీలు ఉద్యోగుల స్థానంలో చాట్‌బాట్‌లను ఉపయోగించుకుంటున్నాయి. ఇదంతా నిజమే కావొచ్చు..టెక్ కంపెనీలు అలా చేస్తున్నట్టు చాలా ఫ్రూఫ్‌లు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ మీడియా ఫీల్డ్‌లోనూ స్టార్ట్ అయ్యింది. కొన్ని న్యూస్ ఛానెల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో యాంకర్లను తయారు చేశాయి. ఈ వర్చువల్ యాంకర్లను పరిచయం చేసిన వాళ్లలో తెలుగు, కన్నడ, ఒరియా న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. ఈ ఏఐ యాంకర్ల రాకతో రియల్ న్యూస్ రీడర్లకు భయం పట్టుకుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో అసలు నిజమెంతా..? న్యూస్ రీడర్లు అంతలా భయపడాల్సిన అవసరం ఉందా..?
చరిత్ర ఏం చెబుతోంది?:
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కిన ప్రతిసారి.. ఉద్యోగాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. గతంలో కంప్యూటర్ల రాకతో జాబ్స్ పోతాయన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ కంప్యూటర్ల వాడకం పెరిగే కొద్దీ పాత ఉద్యోగాలు పోయిన మాట వాస్తవామే కానీ..అంతకుమించిన కొలువులు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఐటి సెక్టర్ లేకుండా ప్రపంచంలో ఏ పని జరగని పరిస్థితి ఉంది. ఇదంతా మనుషుల సాయంతోనే జరుగుతోంది. కంప్యూటర్లు విస్తరిస్తున్న సమయంలో ఇంత మార్పు భవిష్యత్‌లో రానుందని పెద్దగా అంచనాలు లేవు. మనుషులు చేసే పని కంప్యూటర్ చేసేస్తుందని..అందుకే ఉద్యోగాలు ఉండవన్న భయం మాత్రమే ఉంది.. ఇప్పుడా భయం ఎక్కడా కనిపించడంలేదు. కంప్యూటర్లతోనే కోట్లాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మాత్రం ముప్పు తప్పదని.. ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలే దానికి సాక్ష్యం అని చెబుతున్నారు నిపుణులు. 160మంది చేసే పని ఓ రోబో చేస్తుందని.. ఇటివలే 'దుకాన్' సంస్థ తమ కంపెనీ ఉద్యోగుల్లో 90శాతం మందిని తొలగించింది. ఇలా చాలా కంపెనీలు ఇదే తరహా ఫార్మూలాను ఉపయోగించే దశగా అడుగులు వేస్తున్నాయి. మరి న్యూస్ రీడర్ల సంగతేంటి..? వాళ్లకి కూడా జాబ్ ముప్పు తప్పదా..?
న్యూస్ రీడర్లు టెన్షన్ పడాల్సిన అవసరం ఉందా?
2018లో తొలిసారిగా చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో న్యూస్ చదివే యాంకర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు ఇండియాలో కూడా పలు న్యూస్ ఛానెల్స్ అచ్చమైన ఇండియన్ ట్రెడీషన్ గెటప్‌తో..శారీతో ఏఐ యాంకర్లను తీసుకొచ్చాయి. దీని కారణంగా యాంకర్లలో ఉద్యోగ భయం పట్టుకుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీని గురించి అసలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఎందుకంటే టెక్ జాబ్స్ వేరు.. న్యూస్ రీడింగ్ జాబ్ వేరు. ఓ వార్తను ఎమోషన్‌తో చదవడం వేరు యాంత్రికంగా చదవడం వేరు. ఏఐ న్యూస్ రీడర్ల ఎంట్రీతో రియల్ యాంకర్లు ఎందుకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదో కారణాలు తెలుసుకోండి..
1) ఎమోషనల్ ఇంటెలిజెన్స్: రీయల్ యాంకర్లు ఎడాపెడా న్యూస్ చదువుకోని వెళ్లరు.. వార్తకి తగ్గట్టుగా భావోద్వేగాలు చూపిస్తారు. గోంతు ఎప్పుడు మార్చాలి..ఎప్పుడు హ్యాపీ టోన్‌లో రీడ్ చేయాలి..ఎప్పుడు బాధగా చదవాలి..ఎప్పుడు సెటైరికల్‌గా చదవాలన్నది వాళ్లకి తెలుసు. ఇటు ఏఐ యాంకర్లు మెషీన్ లాంగ్వేజ్ ప్రకారం న్యూస్ చదువుతుంది. ఇక్కడ కూడా ఎమోషన్స్‌ని సెట్ చేసే అవకాశమున్నా..టీవీ వీక్షించే ప్రేక్షకులు మాత్రం ఓ మనిషి భావోద్వేగాలతో కనెక్ట్ అయిన విధంగా ఓ యంత్రం ఎమోషన్స్‌తో కనెక్ట్ అవ్వరు.
2) సందర్భానుసారంగా మాట్లాడడం: రియల్ న్యూస్ రీడర్లు రిపోర్టర్‌తో మాట్లాడేటప్పుడు సందర్భానుసారంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కూడా స్పాంటేనిటీ ఉంటుంది. ఏఐ రీడర్లకు అలా స్పాంటేనియస్‌గా రియాక్ట్ అయ్యేలాగా డిజైన్ చేసినా.. అందులో ఫీల్ మిస్ అవుతుంది. అవతలి వ్యక్తి ఓ మనిషికి ఇచ్చే రియాక్షన్..ఓ మెషీన్‌కి ఇచ్చే రియాక్షన్ ఒకలాగా ఉండవు.
3) అనాలసిస్: సీరియస్ న్యూస్ వ్యూయిర్స్ ఎక్కువగా అనాలసిస్‌ని ఇష్టపడతారు. ఓ ఘటన జరిగినప్పుడు న్యూస్ రీడర్ ఇచ్చే అనాలసిస్‌పై ఎక్కువగా దృష్టి పెడతారు. ఇటు మెషీన్‌తో పని చేసే రీడర్ ఎమోషన్స్ క్యారీ చేస్తూ అనాలసిస్ ఇవ్వగలిగినా దాని ఇంపాక్ట్ మాత్రం పెద్దగా ఉండదు. ఓ మనిషి బలగుద్ది చెప్పడం వేరు.. ఓ మెషీన్ గోంతు మార్చి విశ్లేషించడం వేరు..
4) నమ్మకం: ఇది అన్నిటికంటే ముఖ్యం. ఓ వార్త ఏఐ సాయంతో చదువుతుంటే దాన్ని కంట్రోల్ చేసేవాళ్లు వేరుంటారు. అసలు మెషీన్ చెబుతున్నది నిజమేనా.. లేక ఏమైనా టెక్ ఇష్యూస్ వచ్చాయా అన్న అనుమానం తరుచుగా ప్రేక్షకులకు వస్తే అసలు ఛానెల్ పెట్టడం తగ్గించేస్తారు.
5) జవాబుదారీతనం: ఓ న్యూస్ మిస్‌లీడ్ అయ్యిందనుకుందాం..అంటే ఫాల్స్ ఇన్ఫో ఇచ్చిందనుకుందాం.. అప్పుడు ఛానెల్‌కి సంబంధించిన వాళ్లలో ఎవరో ఒకరు బాధ్యత వహిస్తారు. ఇక్కడ మెషీన్ తప్పు చేస్తే ఎవరు జవాబు చెబుతారు.? ఏఐ కంట్రోల్ ఒకరి చేతిలో ఉండే వ్యవహారం కాదు. తప్పు టెక్నికల్ వాళ్లదా.. అక్కడ మెషీన్ కంట్రోల్ చేస్తున్నవాళ్లదా అని తెలుసుకునే లోపు ఫాల్స్ ఇన్ఫో జనాల్లోకి వెళ్లిపోతుంది. యంత్రాలు ఎప్పుడూ 100శాతం కచ్చితత్వంతో పని చేయవు..ఎప్పుడో ఓసారైనా ఎర్రర్స్ చూపిస్తాయి. వార్తల్లో అలా తప్పులు వస్తే జనాలు ఇష్టపడరు
6) భద్రత: సైబర్ సెక్యూరిటీ ముప్పు ఎక్కువుగా ఉన్న కాలమిది. ఫ్యూచర్‌లోనూ సైబర్ అటాక్స్ తగ్గే అవకాశాలు లేవు. ఇండియాలో న్యూస్ చదువుతున్న యాంకర్‌ని పాకిస్థాన్ నుంచి కంట్రోల్ చేసే ఛాన్స్ ఉండదు..అదే టెక్నాలజీ యాంకర్లు సైబర్ దాడులకు గురైతే.. ప్రపంచంలో ఎక్కడ నుంచైనా న్యూస్ ఏం చదవాలో కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇది అసలకే మోసం తీసుకొస్తుంది.
ఇక ఇవే కాకుండా ప్రజలు కూడా మెషీన్‌తో పని చేసే యాంకర్లను మొదట్లో ఆదరించినంతగా తర్వాత లైక్ చేయరు..ఎందుకంటే వాళ్లకి రోజు కొత్తదనం కావాలి.. భావోద్వేగాలు అన్నిటికంటే కావాలి. చదువుతున్నది యంత్రమేగా అన్న భావన వచ్చిన తర్వాత పెద్దగా పట్టించుకోరు.. ఏదైనా కొత్తల్లోనే వాటిపై ఇంట్రెస్ట్ ఉంటుంది.. తర్వాత బోర్ కొడుతుంది..అదే మనుషులతో అలా కాదు కదా.. అందుకే మిగిలిన రంగాల సంగతి అటు ఉంచితే ఏఐ న్యూస్ రీడర్లతో నిజమైన యాంకర్లు మాత్రం అసలు భయపడాల్సిన పనేలేదు..!