కార్పొరేషన్‌కు నిధులు
ఖమ్మం జిల్లా ప్రజలకు అధికార పార్టీ శుభవార్త చెప్పింది. ఎన్నికల వేళ ఖమ్మం కార్పొరేషన్‌కు మంత్రి కేటీఆర్ ( KTR) 100 కోట్ల నిధులు మంజూరు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తితో ఈ నిధులు విడుదల చేశారు. తన విజ్ఞప్తి మేరకు నిధులు మంజూరు చేసినందుకు ఖమ్మం ప్రజల తరుపున మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా నాలుగేళ్ళ పదవీకాలం పూర్తి (Completed four years term as minister) చేసుకుంటున్న సందర్భంగా మంత్రి పువ్వాడకు అభినందనలు తెలుపుతూ జీవో కాపీని మంత్రి కేటీఆర్ (Minister KTR) అందజేశారు.
నాలుగేళ్ళ పదవీకాలం పూర్తి
రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న శుభ సందర్భంగా ఖమ్మంకు మరోసారి నిధుల వరద పారించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి కేటీఆర్ కి చేసిన విజ్ఞప్తి మేరకు TUFIDC(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా ఖమ్మంకు రూ.100 కోట్ల నిధుల (sanctioned 100 crore funds)ను విడుదల చేశారు. శుక్రవారం ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ( KTR) చేతుల మీదగా జీవో కాపీని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కి అందజేశారు. ఖమ్మం అభివృద్ధికి మరో రూ.100 కోట్ల నిధులు ఇచ్చిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kuma) ఖమ్మం ప్రజల (Khammam people) తరుపున కేటీఆర్ కి కృతజ్ఞతలు ( thank you) తెలిపారు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నాలుగేళ్ళ సుపరిపాలన పూర్తి చేసుకున్న అజయ్ కుమార్‌కి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.