లండన్ లో తెలుగమ్మాయి మృతి

New Update

లండన్‌ లో ఉన్మాది రెచ్చిపోయాడు. తేజస్విని అనే తెలుగు అమ్మాయిని బలి తీసుకున్నాడు. తేజస్విని, ఆమె ఫ్రెండ్‌ అఖిలపై కత్తితో దాడి చేశాడు బ్రెజిల్‌ కు చెందిన యువకుడు. స్పాట్‌ లోనే తేజస్విని మృతి చెందగా.. అఖిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. తేజస్విని స్వస్థలం ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లి. ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లింది.

telugu girl death in london

తేజస్విని తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, రమాదేవి. తుర్కయాంజల్‌ మున్సిపాలిటీ పరిధిలో నివాసముంటున్నారు. తండ్రి ఎలక్ట్రీషియన్‌ గా పని చేస్తున్నారు. తేజస్విని MS చదివేందుకు రెండున్నరేళ్ల క్రితం లండన్‌ వెళ్లింది. 3 నెలల క్రితం ఇంటికి రావాల్సి ఉంది. ఐతే పలు కారణాలతో లండన్‌ లోనే ఉండిపోయింది.

ప్రస్తుతం వెంబ్లి ఏరియాలో ఉంటోంది తేజస్విని. నిందితుడు తేజస్విని నివాసముంటున్న అపార్ట్‌ మెంట్‌ లోనే నివాసముంటున్నాడు. వారం క్రితమే తేజస్విని ఎదురు ఫ్లాట్‌ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఐతే ఆగస్ట్‌ లో వస్తా అని తల్లిదండ్రులతో చెప్పిన తేజస్విని.. ఇంతలోనే సైకో దాడికి బలవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు.

తేజస్విని మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు మృతురాలు తేజస్విని అన్న పవన్‌ కుమార్‌ రెడ్డి ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆమె ఫ్రెండ్‌ అఖిలది జనగామలోని ఆలేరు.

Advertisment
Advertisment
తాజా కథనాలు