థియేటర్స్ బంద్ వ్యవహారం.. నిర్మాతల మండలి - ఎగ్జిబీటర్ల మధ్య క్లాష్, ఆ సినిమాల పరిస్థితి ఏంటి?

తెలంగాణాలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని ఓ రెండు వారాల పాటూ మూసివేస్తున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలపై TFPC స్పందిస్తూ అది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంతో నిర్మాతల మండలి, ఎగ్జిబీటర్ల మధ్య భారీ క్లాష్ ఏర్పడింది.

థియేటర్స్ బంద్ వ్యవహారం.. నిర్మాతల మండలి - ఎగ్జిబీటర్ల మధ్య క్లాష్, ఆ సినిమాల పరిస్థితి ఏంటి?
New Update

Telugu Film Producers Council : తెలంగాణాలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని ఓ రెండు వారాల పాటూ మూసివేస్తున్నట్లు ఇటీవల న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెలలో పెద్ద సినిమాలు రిలీజ్ కి లేకపోవడం, ఓ వైపు ఎలక్షన్స్ మరోవైపు ఐపీఎల్ ఉండటంతో అగ్ర హీరోలు తమ సినిమా రిలీజ్ లను వాయిదా వేసుకున్నారు.

ఆ ప్రభావం కాస్తా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పై పడ్డాయని, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి జనాలు పెద్దగా రాకపోవడంతో భారీ నష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో రెండు వారాలు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్లు వార్తలు బయటికి వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ స్పందిస్తూ అది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read : ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య తండ్రి ఎమోషనల్ ఇంటర్వ్యూ..

అదంతా ఫేక్ న్యూస్

ఎలక్షన్స్, ఐపీఎల్ వల్ల తక్కువ కలెక్షన్స్ రావడంతో కొందరు థియేటర్ యజమానులు థియేటర్స్ మూసేసారు. ఇది కేవలం వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎవ్వరూ మమ్మల్ని సంప్రదించలేదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు దీంతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాం అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీంతో ఇండస్ట్రీలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

నిర్మాతల మండలి Vs ఎగ్జిబిటర్స్

తెలంగాణలో థియేటర్స్ బబంద్ వ్యవహారంతో నిర్మాతల మండలి, ఎక్జిబీటర్ల మధ్య భారీ క్లాష్ ఏర్పడిందనే చెప్పాలి. ఈ క్లాష్ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలకి సమస్యగా మారింది. తెలుగులోరానున్న రెండు వారాల్లో రాజు యాదవ్, లవ్ మీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో పాటూ మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఇంతలో థియేటర్స్ బంద్ ఇష్యూ ఈ సినిమాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ నిజంగానే థియేటర్స్ బంద్ అయితే ఈ సినిమాలన్నీ రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. మరి ఇందుకు నిర్మాతలు ఒప్పుకుంటారా? లేక ఎగ్జిబిటర్స్ తో కూర్చొని సమస్యను పరిష్కరించుకుంటారా? అనేది చూడాలి.

#movie-theaters-closed-in-ts #tfpc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి