Posani Krishna Murali: బ్రాహ్మణి, భువనేశ్వరి భర్తలను మించిన భార్యలు.. పవన్ ఓ పిచ్చోడు: పోసాని సంచలన వీడియో

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి నారా బ్రాహ్మణి, భువనేశ్వరి భర్తలను మించిన భార్యలంటూ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాన్ పిచ్చోడు, అమాయకుడంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి.

New Update
Posani Krishna Murali: బ్రాహ్మణి, భువనేశ్వరి భర్తలను మించిన భార్యలు.. పవన్ ఓ పిచ్చోడు: పోసాని సంచలన వీడియో

Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) మరో సారి సంచలన వాఖ్యలు చేశారు. ఏపీలో భర్తలని మించిన భార్యలు ఉన్నారంటూ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari), బ్రహ్మణి (Nara Bramhani) టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు చేశారు. తప్పు చేస్తే నిలదీయాల్సింది పోయి.. సమర్థిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. భర్త, కొడుకు నాశనం కావటానికి ప్రధాన కారణం భువనేశ్వరేనంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని. అత్తాకోడళ్లు ఇద్దరూ మా ఆయన మంచివాళ్ళని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబును (Chandrababu) జైలుకు పంపింది జగన్ (CM jagan) ఎలా అవుతారని ప్రశ్నించారు పోసాని. అలా పంపించాలనుకుంటే నాలుగేళ్ల ముందే పంపించే వారు కదా అని అన్నారు. ఒక్కపుడు చంద్రబాబు, లోకేష్ (Nara Lokesh) ను తిట్టిన పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నాడంటూ ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిచ్చోడు, అమాయకుడంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. కాపు ఓట్ల కోసమే టీడీపీ నేతలు పవన్ కల్యాణ్‌ తో మంచి సంబంధాలు మెయింటేన్ చేస్తున్నారంటూ పోసాని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Sajjala: టీడీపీ నేతల దీక్షలపై సజ్జల సెటైర్లు.. పూనకాలు వద్దంటూ పవన్ పై ఫైర్

భారతదేశానికి ఒకరే గాంధీ.. కానీ ఏపీకి చంద్రబాబు, లోకేష్ ఇద్దరు గాంధీలంటూ సెటైర్లు విసిరారు పోసాని. ఎన్టీఆర్ ను ఆనాడు చెప్పుతో కొడితే భువనేశ్వరి చుక్క కన్నీరు కార్చలేదన్నారు పోసాని. పవన్ కళ్యాణ్ ఎంత తిట్టినా పొత్తు ఓట్ల కోసమేనన్నారు పోసాని. కాపు కులాన్ని చంద్రబాబు ఆసహ్యించుకుంటారన్నారు. పవన్ కల్యాణ్‌ వంగవీటి చరిత్ర తెలుసుకోవాలని సూచించారు.

కాపులు ఎవరికైనా ఓట్లు వేయండి చంద్రబాబు కు తప్పా అని కోరారు పోసాని. జగన్ మోహన్ రెడ్డి నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు సత్యమేవ జయతే ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. జయప్రద లాంటి వాళ్లు ప్రజాసేవ కోసం వస్తే వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే మంచి లేదంటే అక్రమ కేసులా అంటూ ప్రశ్నించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు