TDP Leaders : వచ్చే ఎన్నికల్లో ఇక యుద్ధమే..రాజీనామా చేసే దమ్ము మీకుందా..!!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి వెళ్తాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ప్రకటనపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే అంటున్నారు తెలుగు నేతలు. సింహం సింగిల్ గా వస్తుందని వైసీపీ చేసే కామెంట్స్ పై టీడీపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.
TDP Leaders: వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి వెళ్తాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ప్రకటనపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సరైన సమయంలో పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే అంటున్నారు తెలుగు నేతలు.
పవన్ పొత్తుల నిర్ణయంతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయిందని కౌంటర్ ఇచ్చారు టీడీపీ బుచ్చయ్య చౌదరి(butchaiah chowdary). ఇప్పటికే యువగళం పాదయాత్రతో వైసీపీ వెన్నులో వణుకుపుడుతోందని..ఇక పవన్ తీసుకున్న నిర్ణయంతో ఏమీ చెయ్యాలో దిక్కుతోచని పరిస్ధితిలో ఉన్నారని అన్నారు. దుర్మార్గపు పాలనకు ముగింపు పలుకుతామంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఏవ్వరూ ఆపలేరని ధీమ వ్యక్తం చేశారు. జగన్‌కు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పెందుకు అందరం కలిసి పొరాడుతామని వ్యాఖ్యనించారు.
టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే అంబటి ఎందుకు హడావిడి చేస్తున్నారంటూ టీడీపీ వంగలపూడి అనిత(vangalapudi anitha) ఎద్దెవ చేశారు. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అంటే ఇదేనని కౌంటర్ ఇచ్చారు. సభ్యత సమస్కారం ఉంది కాబట్టే వైసీపీ ఎన్ని కుట్రలు చేస్తున్నా మౌనంగా ఉంటున్నామని..అదే జనసైనికులను, టీడీపీ కార్యకర్తలను, 70 లక్షల మంది క్రియశిలక సభ్యులను వదిలితే మా మాటల తూటలకు బలైపోయేది అంబటి, రోజా లాంటి వాళ్లేనని దుయ్యబట్టారు. సింహం పేరు పెట్టుకుని వైసీపీ ఎందుకు హడావీడి చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు. టీడీపీ జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయనే వార్త వినిగానే ఏమీ మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని సెటైర్లు వేస్తున్నారు.
వచ్చే ఎన్నికలలో వైసీపీ సింగల్ డిజిట్‌కే పరిమితం అవుతారని అన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivas rao). జంతువులు సింగల్‌గా వస్తాయని.. మనుష్యులు కలిసి వస్తారని పవన్ చక్కగా చెప్పారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తమ కూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కూడా కలిసి వస్తే సంతోషమే అని చెప్పుకొచ్చారు.
సైకో పరిపాలన ఏ విధంగా ఉంటుందో అప్పట్లో హిట్లర్ చూశాం.. ఇప్పుడు వైసీపీ నాయకులను చూస్తున్నామని భూమా అఖిలప్రియ(bhuma akhila priya) దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడుకు నోటీసులు మాత్రమే ఇస్తారని అనుకున్నాము కానీ., అరెస్టు చేస్తారని తెలిసి ఉంటే ఆ ఫంక్షన్ హాల్ గేటు కూడా టచ్ చేయనిచ్చే వాళ్ళం కాదని అన్నారు. పవన్ కళ్యాణ్ జనసైనికులకు ఒక్క చిన్న మాట చెప్పిన రాజమండ్రి సెంట్రల్ జైలు మీద పడి చంద్రబాబును బయటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈరోజు టపాకాయలు కాల్చుకొని స్వీట్లు పంచుకున్న వారందరూ.. రేపు ఎంతమంది సెంట్రల్ జైల్లో కూర్చుంటారు ఆలోచించుకోండి అంటూ హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసైనికులు, టీడీపీ తలుచుకుంటే వైసీపీ నాయకులకు సెంట్రల్ జైలు కూడా సరిపోవన్నారు. అవినీతి జరిగింది అని చెప్పడం కాదు, జరిగింది అని నిరూపిస్తే మేము అందరము రాజీనామా చేసి పోటీ కూడా చేయముని సవాల్ చేశారు..నిరుపించకపోతే వైసీపీ మంత్రులకు రాజీనామా చేసే దమ్ము మీకుందా అంటూ ప్రశ్నించారు.

Also Read : పక్క రాష్ట్రం గురించి మాకెందుకు అంటే.. ఇక జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పెట్టడం ఎందుకు..?