Rashmika: ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిన మూవీని..నేషనల్ క్రష్‌ ఎంచుకుందా..?

టాలీవుడ్ మాస్‌ మహారాజ్‌ రవితేజ(Ravi Teja)తో నేషనల్ క్రష్‌ రష్మిక(Rashmika Mandanna) మూవీ చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్! వాళ్ళిద్దరి కలయికలో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడు విజయాల తర్వాత నాలుగో సినిమా చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. అందులో హీరోయిన్ గా రష్మిక మందనను సెలక్ట్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

New Update
Rashmika: ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిన మూవీని..నేషనల్ క్రష్‌ ఎంచుకుందా..?

Rashmika: టాలీవుడ్ మాస్‌ మహారాజ్‌ రవితేజ(Ravi Teja)తో నేషనల్ క్రష్‌ హీరోయిన్‌ రష్మిక(Rashmika Mandanna) మూవీ చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్! వాళ్ళిద్దరి కలయికలో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. 'డాన్ శీను'తో 'బలుపు', 'క్రాక్' సినిమాలు చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడు విజయాల తర్వాత నాలుగో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

publive-image

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'వీర సింహా రెడ్డి' విజయం తర్వాత ఆ సంస్థలో గోపీచంద్ మలినేని చేస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమాలో కథానాయికగా రష్మికా మందన్నా నటించనున్నారని సమాచారం. ఇటీవల ఆమెను సంప్రదించారట. ఇటీవల రష్మికను కలిసిన దర్శకుడు ఆమెకు కథ చెప్పారని తెలిసింది.

publive-image

మొదట ఈ సినిమాలో శ్రీలీలని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు అన్న వార్తలు వినిపించాయి. కానీ ఆమెకు డేట్స్ కుదరకపోవడంతో ఆ స్థానంలోకి ఇప్పుడు రష్మిక మందనని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు రష్మిక మందన మరియు రవితేజ కాంబినేషన్లో ఒక్క మూవీ కూడా వచ్చింది లేదు. అందుకే వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో దర్శకులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

publive-image

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం పుష్పా సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో సైతం అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారింది. స్టార్ హీరో అమితాబ్ సినిమాలో సైతం నటించి మెప్పించింది ఈ చిన్నది.'పుష్ప' తరువాత తెలుగులో రష్మికకు మరో హిట్ పడలేదు. బాలీవుడ్ లో చేసిన 'మిషన్ మజ్ను' .. కోలీవుడ్ లో చేసిన 'వరిసు' ఆమె గ్రాఫ్ ను నిలకడగా ఉంచుతూ వెళ్లాయి. ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన పనులతో ఆమె బిజీగా ఉంది.

Also Read: ఉత్తర అమెరికాలో సలార్ సినిమా క్రేజ్..!! ఎన్ని కోట్లు అమ్ముడుపోయిందంటే..?

Advertisment
తాజా కథనాలు