/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/navadeep-jpg.webp)
మాదాపూర్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ కేసులో నిర్మాత కేపీ చౌదరీ అరెస్ట్ కాగా..మరో ప్రముఖ హీరో పేరు తెర మీదకు వచ్చింది. ఆయనే నవదీప్. అయితే ప్రస్తుతం నవదీప్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చేపట్టినట్లు సీపీ ఆనంద్ తెలిపారు.
మీడియాతో మాట్లాడిని సీపీ ఈ విషయాన్ని వెల్లడించారు. పరారీలో ఉన్న నవదీప్ కోసం వెదుకుతున్నట్లు ఆయన వివరించారు. ఈ కేసులో సంబంధం ఉన్న ఓ మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను కూడా అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. ఇదిలా ఉంటే నవదీప్ మాత్రం నేను పరారీలో లేను. నేను ఇక్కడే ఉన్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అక్కడ ఎవరూ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలని ఆయన అన్నారు. అయితే గతంలో కూడా హీరో నవదీప్ పేరు డ్రగ్స్ కేసులో తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను అరెస్ట్ చేయగా..అతను నవదీప్ కన్జ్యూమర్ గా ఉన్నాడని తెలిపాడు. దీంతో పోలీసులు నవదీప్ కోసం గాలించడం మొదలు పెట్టారు.
That's not me gentlemen
— Navdeep (@pnavdeep26) September 14, 2023
I'm right here .. pls clarify thanks
updated soon