CV anand: రూ.712కోట్ల సైబర్‌ స్కామ్‌..ఎలా చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

టెలిగ్రామ్‌ వేదికగా జరుగుతున్న సైబర్‌ మోసంపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కీలక విషయాలు చెప్పారు. రూ.712కోట్ల సైబర్ స్కామ్‌ టెలిగ్రామ్‌ యూజర్ల టార్గెట్‌గానే జరిగిందని.. ఈ ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు.

CV anand: రూ.712కోట్ల సైబర్‌ స్కామ్‌..ఎలా చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు..!
New Update

మీరు టెలిగ్రామ్‌(telegram) అకౌంట్ వాడుతున్నారా? ఎప్పుడైనా ఎవరి దగ్గర నుంచైనా టాస్క్‌ల పేరుతో మెసేజులు వచ్చాయా? దయచేసి ఆ నంబర్‌ని ఇమిడియెట్‌గా బ్లాక్‌ చేయండి..ఆ సంబంధిత మెసేజ్‌కి ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవొద్దు..ఎందుకంటే సైబర్(cyber) నేరగాళ్ల కన్ను ఎక్కువగా టెలిగ్రామ్‌ యూజర్లపైనే ఉంది. ఈ విషయాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చెప్పారు. రూ.712కోట్ల సైబర్‌ స్కామ్‌(scam)పై నిర్వహించిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్‌(cv anand) చెప్పిన విషయాలు షాక్‌కి గురిచేస్తున్నాయి. సైబర్‌ ఉచ్చులో ప్రజలు ఎలా పడుతున్నారో వివరించారు సీవీ ఆనంద్‌.

టాస్క్‌ల పేరిట ఉచ్చు:
ముందుగా 'హాయ్' అని మెసేజ్‌ వస్తుంది. మనం రిప్లై ఇచ్చిన తర్వాత ఆ ఛాట్‌ కాసేపు కొనసాగుతుంది. మెసేజ్‌ కూడా అమ్మాయి డీపీ ఐడీ నుంచి వస్తుండడంతో కొంతమంది ట్రాప్ అవుతారు. ఈ టాస్క్ చేస్తే ఇంత డబ్బులు వస్తాయని నమ్మబలుకుతారు. దానికంటే ముందుగా డబ్బులను ఇన్‌వెస్ట్ చేయమంటారు. ఆ ఇన్‌వెస్ట్‌మెంట్‌కి తగ్గట్టుగా టాస్క్‌లు అసైన్ చేస్తారు. అవి సక్సెస్ అయితే మనం పెట్టిన డబ్బులు తిరిగి రెట్టింపు అవుతాయి. ముందుగా టాస్క్‌లు ఫినిష్‌ అయ్యేలాగే ప్రొగ్రెమ్ చేస్తారు.. డబ్బులు వచ్చాయి కదా అని.. మళ్లి ఇన్‌వెస్ట్ చేస్తారు బాధితులు. తర్వాత డబ్బులు పోతునే ఉంటాయి కానీ రావు.. 20లక్షలు పోతే.. ఇంకో 20లక్షలు పెట్టడం.. అవి కూడా తిరిగి రాకపోయే సరికి మరో 40లక్షలు చెల్లించడం..ఇలా మొత్తం డబ్బులు గోవిందా అవ్వడం తప్ప తిరిగి రూపాయ్‌ వచ్చే ఛాన్స్‌ ఉండదు.

ఈ డబ్బులను ఏం చేస్తారు?
నిజానికి ఈ సైబర్ క్రైమ్ కథంతా ఇండియా నుంచి రన్‌ అవ్వదు.. దుబాయ్‌ నుంచి ఆపరేట్ అవుతుంది. అందుకే నిందితులను పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లతో కంపేర్ చేస్తే టెలిగ్రామ్‌ ద్వారా ఐడి గుర్తించడం,నిందితులను పట్టుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. ఇదే విషయాన్ని స్పష్టం చేశారు సీవీ ఆనంద్‌. రాధికా మార్చంట్ పేరుతో ఒక అకౌంట్ మాత్రమే తమకు దొరికిందని.. అందులో ఇచ్చిన నెంబర్ ఆధారంగానే నిందితుడు ప్రజాపతి పట్టుపడ్డాడన్నారు. ఫేక్ ఆధార్‌ కార్డ్‌లు క్రియేట్ చేయడం.. నకిలీ కేవైసీ(KYC)లు సృష్టించడంతో పాటు టెలిగ్రామ్‌ని ఎక్కువగా యూజ్ వారికి ఎర వేయడమే ఈ ముఠా పని. బాధితుల దగ్గర నుంచి దోచుకున్న డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా విదేశాలకు మళ్లిస్తారు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

కొత్త సైబర్ సెక్యూరిటీ టీమ్ ఈ కేసును సాల్వ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇక సామాన్య వ్యక్తులు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టమని.. కానీ నేరగాళ్లకి ఇది సులువైన పనిగా మారిందన్నారు సీవీ ఆనంద్. షేల్ కంపెనీలను ఈజీగా ఓపెన్ చేశారని.. ఫేక్ డాక్యూమెంట్స్.. బ్యాంకులకు తరచూ దీని గురించి చెబుతున్న పట్టించుకోవట్లేదన్నారు. ఆర్బీఐ ఆధ్వర్యంలో అన్ని బ్యాంకులతో మళ్ళీ మీటింగ్ పెడతామన్నారు సీవీ ఆనంద్. ఇక నిందితులకు చెందిన 48 అకౌంట్లలో రూ.584 కోట్లతో పాటు మరో రూ.128 కోట్లు ఇతర అకౌంట్లలో జమ అయినట్లు గుర్తించామని చెప్పారు.ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక కీలక నిందితుడిని సైతం త్వరలోనే పట్టుకుంటామన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe