చికెన్ ధరకు రెక్కలు.... రికార్డు స్ధాయిలో చికెన్ ధర

New Update

చికెన్ ధరకు రెక్కలు వచ్చాయి. రోజు రోజుకి.. అమాంతం పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కిలో చికెన్ 320-350 వరకూ ధర పలుకుతోంది. ప్రస్తుతం ప్రాంతాలను బట్టి స్వల్ప మార్పులతో లైవ్ కోడి కిలో 170-200, స్కిన్‌తో 280-300, స్కిన్‌ లెస్ 320-350 వరకూ ధర పలుకుతోంది. అంటే ఒక్క నెలలోనే దాదాపు వంద రూపాయలు పెరిగిందన్నమాట. అయితే వేసవి ప్రభావంతో పాటూ రా.. మెటీరియల్ ఖర్చుల పెరుగుదల కూడా చికెన్ ధర పెరుగుదలకు కారణమని చెప్పాలి. అయితే ప్రతీ ఏటా వేసవి ఉన్నా ఈసారే ధరలు ఇంతలా పెరగడానికి కారణం ఏంటి?

telanganachicken-prices-hike-in-telangana

వేసవిలో కోళ్లు మేత సరిగా తినవు. నీరు ఎక్కువగా తాగుతాయి. దీంతో వాటి పెరుగుదల రేటు తగ్గిపోతుంది.అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకూ 40 రోజుల్లో 2.5 కేజీలు పెరిగే కోడి, ఇప్పుడు మాత్రం 40 రోజుల్లో 2 కేజీల బరువు పెరగడం కూడా కష్టంగా ఉంటుంది. కోవిడ్ తరువాత ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న వేసవి కాలం ఇదే. ఈసారి వడగాల్పుల తీవ్రత గత రెండేళ్ల కంటే ఎక్కువ ఉందని కోళ్ల పెంపకందార్లు చెబుతున్నారు. రవాణాలో, లోడింగ్, అన్ లోడింగ్ దగ్గర కొన్ని కోళ్లు అత్యధిక వేడి కారణంతో చనిపోతాయి. షాపుల్లో కోయడానికి సిద్ధంగా ఉన్న కోళ్లు కూడా వేడికి తట్టుకోలేక మరణిస్తున్నాయి. ఈ కారణాల వల్ల వేసవిలో కోడి మాంసం ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. కాబట్టి ధరల పెరుగుదలకు అది పెద్ద కారణం. పైగా ఈసారి వేసవి నిడివి ఎక్కువ కాలం ఉంది. చికెన్‌ మాంసాన్ని షాపు నుంచి తెచ్చాక కడగకూడదా? వాష్ చేస్తే ప్రమాదమా? మరి ఎలా వండాలి?

10 జనవరి 2023 కోడి మాంసం ‘పండించుకోవచ్చు’ఇక కోళ్లను చంపాల్సిన అవసరం లేదు...30 జనవరి 2023 మైక్రోవేవ్‌లో వండిన వంట ఆరోగ్యానికి మంచిదేనా? 18 సెప్టెంబర్ 2021 కోళ్ల ఫామ్ ఫిబ్రవరి వరకు భారీగా తగ్గిన ధరలు ఫిబ్రవరి వరకూ కోడి మాంసం ధరలు బాగా పడిపోయాయి. రైతుకు అసలు గిట్టుబాటు ధర లేదు. దీంతో పెద్ద సంఖ్యలో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకం తగ్గించారు.‘‘మొన్నటికి మొన్న ధరల తగ్గుదలలో రైతులు చాలా నష్టపోయారు. ఇప్పుడు లైవ్ బర్డ్‌ని ఫామ్ దగ్గర 120-130కి కొంటున్నారు. కానీ మూడు నెలల క్రితం వరకూ కూడా కేజీ కేవలం 62-65కే అమ్మారు. వాస్తవానికి ఒక కేజీ లైవ్ బర్డ్ ఉత్పత్తికే 90 రూపాయల ఖర్చు అవుతుంది.

ఇప్పుడు వచ్చేది కూడా లాభం కాదు. కేవలం గత నష్టాలను పూడ్చుతున్నాం. అంతే. అప్పట్లో అందరూ నష్టాలకు అమ్మాల్సి రావడంతో తక్కువ కోళ్లను పెంచారు.’’అంటూ తెలంగాణ బ్రాయిలర్ బ్రీడర్స్ అసోసియేషన్ వాళ్లు చెబుతున్నారు. నిజానికి దేశంలో సొంతంగా కోడి పిల్లలు కొని, పెంచి, అమ్మేవారు 20 శాతమే ఉంటారు. వీరు రిస్క్ వ్యాపారం చేస్తారు. మిగిలిన 80 శాతం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్‌లో ఉంటారు. అంటే వారు ముందుగానే ఏదో ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుని కోళ్లను పెంచుతారు.షెడ్, లేబర్ మాత్రమే వీళ్లది. కోడి పిల్లలు, మేత, మందులు, వ్యాక్సీన్లు, అంతా కంపెనీలది. కోడి పిల్లల్ని బాగా పెంచితే దానికి ఇన్సెంటివ్, గ్రోయింగ్ కాస్ట్ మాత్రమే రైతులకు వస్తుంది. ఈ పద్ధతిలో రిస్కు తక్కువ ఉంటుంది. అయితే ఈసారి ఇలా ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ చేసే కంపెనీలు కూడా కోళ్లు పెంచే శాతం తగ్గించాయి. దీంతో మొత్తం మీద ఒక 10 శాతం వరకూ తక్కువ ఉత్పత్తి ఉందని చెప్పొచ్చు. కోళ్ల మేతలో ప్రధానంగా వాడే మొక్కజొన్న ధరలు బాగా పెరిగాయి. ఒక దశలో మొక్క జొన్న 23-27 రూపాయల వరకూ వెళ్లింది. దీంతో కోళ్ల మేత ధరలు పెరిగాయి.

మందులు, వ్యాక్సీన్ల ధరలూ పెరిగాయి. దానికి తోడు కరోనా తరువాత రవాణా చార్జీలు బాగా పెరిగాయి. ఇవన్నీ కలసి కోడి మాంసం ఉత్పత్తి ధరను పెంచేశాయి. భారతదేశంలో బ్రాహ్మణులు మాంసం తినడం ఎప్పటి నుంచి, ఎందుకు మానేశారు? తెలంగాణ, మహారాష్ట్రలతో పాటూ చాలా చోట్ల శ్రావణ మాసంలో మాంసం తినరు. ఆ భయానికి కూడా కోళ్ల పెంపకం సంఖ్య తగ్గించారు రైతులు. ఈ కారణాలతో బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి సాధారణం కంటే 30-40 శాతం తగ్గింది. దీంతో అమాంతం రేట్లు పెరిగిపోయాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు