New Update
/rtv/media/media_files/2024/12/30/ueYZ2emLWJcmOL0ZLdy4.jpg)
KCR
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్య సమస్యలతో ఈరోజు యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో యశోద ఆసుపత్రి వైద్యులు కొద్దిసేపటి క్రితం ఆయన హెల్త్ బులిటన్ విడుదల చేశారు. హై బ్లడ్ షుగర్, లో సోడియం లెవెల్స్ తో కేసీఆర్ బాధపడుతున్నట్లు తెలిపారు. ఇతర అన్ని వైద్య పరీక్షల్లో ఎలాంటి సమస్యలు లేవని తేలిందన్నారు. డయాబెటిస్ ను కంట్రోల్లోకి తెచ్చేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
తాజా కథనాలు