Hyderabad : రన్నింగ్‌ బస్సులో ప్రయాణికురాలి పై అత్యాచారం!

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న రన్నింగ్‌ ట్రావెల్‌ బస్సులో అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈనెల 18న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author-image
By Bhavana
New Update
rape

Hyderabad : హైదరాబాద్‌ చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కదులుతున్న బస్సులో మహిళ పై అత్యాచారం చోటు చేసుకుంది. ఈ ఘటన ఈ నెల 18న జరగగా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..కూకట్ పల్లిలో ఓ మహిళా ప్రయాణికురాలు మార్నింగ్ ట్రావెల్స్ బస్సులో ఎక్కింది. విజయవాడకు వెళ్లాలని చెప్పడంతో టికెట్‌ ఇచ్చిన కండెక్టర్‌ ఆమెకు కూర్చునేందుకు సీటు చూపించాడు. 

చౌటుప్పల్ శివారు ప్రాంతంలోకి రాగానే ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించడంతో ఆ వివాహిత సైలెంట్‌గా ఉండిపోయింది. కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో గట్టిగా ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పేసింది. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ ను కూకట్ పల్లి పోలీస్‌ స్టేషన్ కు బదిలీ చేశారు. అయితే బస్సులో అత్యాచారం చేసినప్పుడు ప్రయాణికులు ఎవరూ లేరా? అనే అనుమానం వ్యక్తం అవుతుంది. మార్నింగ్ ట్రావెల్స్ బస్సు యజమానిని సంప్రదించి క్లీనర్‌, బస్సు నడిపిన డ్రైవర్‌ వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read :  శ్రీలంక ప్రెసిడెంట్ రేసులో దూసుకుపోతున్న దిసానాయకే..

Advertisment
తాజా కథనాలు