భర్త ఆస్తిపై కన్నేసిన భార్య.. ప్రియుడితో కలిసి దారుణం!

హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ రమేశ్ కుమార్ ఆస్తిపై భార్య నిహారిక కన్నేసింది. ఎలాగైన కోట్ల ఆస్తి దక్కించుకుని ప్రియుడు డాక్టర్ నిఖిల్‌‌తో కలిసి జీవించాలనుకుంది. ప్లాన్ ప్రకారమే భర్తని హత్య చేయించింది. ఊటీలో మృతదేహాన్ని తగులబెట్టి పోలీసులకు చిక్కింది.

crime,
New Update

ప్రస్తుత కాలంలో డబ్బుకున్న విలువ మరిదేనికి లేదు. ఆస్తి కోసం సొంత వాళ్లనే మట్టుబెడుతున్నారు. బంధాలు, బంధుత్వాలు మరిచి క్రూర మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి జన్మనిచ్చిన వాళ్లని, కట్టుకున్న వారిని సైతం ఆస్తి కోసం హత్య చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికి ఎన్నో ఘటనలు ఇలాంటివి జరిగాయి. తాజాగా మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. 

ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా? 

భర్త ఆస్తిపై కన్నేసిన భార్య ఎలాగైన అతడిని మట్టుబెట్టి తన ప్రియుడితో కలిసి జీవించాలనుకుంది. పక్కా ప్లాన్ ప్రకారమే తన భర్తని హతమార్చింది. మృతదేహాన్ని తన ప్రియుడితో కలిసి వేరోక ప్రాంతానికి తీసుకెళ్లి తగులబెట్టించింది. చివరికి పోలీసులకు చిక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు

ఆస్తిపై కన్నేసిన భార్య

హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ రమేశ్ కుమార్ (44) ఆస్తిపై భార్య నిహారిక కన్నేసింది. ఎలాగైన కోట్ల ఆస్తి దక్కించుకుని తన ప్రియుడు డాక్టర్ నిఖిల్‌‌తో కలిసి జీవించాలనుకుంది. ప్లాన్ ప్రకారమే ఉప్పల్-భువనగిరి ప్రాంతంలో తన భర్తని హత్య చేయించింది. ఆపై వారిద్దరూ కారులో తీసుకెళ్లి కర్ణాటక పరిధిలోని కొడగు కాఫీ ఎస్టేట్‌లో రమేశ్ మృతదేహాన్ని వేరొక వ్యక్తితో తగులబెట్టించారు. దీంతో సగం కాలిన మృతదేహాన్ని కర్ణాటక పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్! 

ఇందులో భాగంగా దర్యాప్తు ప్రారంభించగా.. నిహారిక, నిఖిల్‌తో పాటు మృతదేహాన్ని తగులబెట్టిన రాణా అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. రూ.8 కోట్ల ఆస్తి కోసమే నిహారిక తన భర్తను హత్య చేయించినట్లు కర్ణాటక పోలీసులు తేల్చారు. ఇందులో భాగంగా నిహారికను విచారించగా.. ఆస్తి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆమె ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా

#crime news telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe