అల్లు అర్జున్ అరెస్ట్‌పై టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్

TG: అల్లు అర్జున్ మామ తమ పార్టీకి చెందిన నాయకుడే అని మహేష్ కుమార్ అన్నారు. సీఎం రేవంత్‌కు అల్లు కుటుంబంతో బంధుత్వం ఉందన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. చట్టం ప్రకారమే అల్లు అర్జున్‌ను పోలీసులను అరెస్ట్ చేశారని చెప్పారు.

New Update
mahesh kumar goud

Mahesh Kumar Goud: అల్లు అర్జున్ ను కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షలు చేస్తున్న ఆరోపణలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తొక్కిసలాటలో సామాన్యురాలు ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. ఆమె కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమే.. చట్టానికి ఎవరు అతీతులు కాదు అని అన్నారు.

అల్లు మామ మా పార్టే...

అల్లు అర్జున్ మామ తమ పార్టీకి చెందిన నాయకుడే అని అన్నారు. సీఎం రేవంత్ కి అల్లు అర్జున్ కుటుంబంతో బంధుత్వం ఉందని అన్నారు. తెలుగు చిత్ర సీమకి కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం అని పేర్కొన్నారు. ఫిల్మ్ స్టూడియోలు కట్టుకోవడానికి కాంగ్రెస్  ప్రభుత్వం భూములు ఇచ్చి వెసులుబాటు కల్పించడం వల్లే చిత్ర సీమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి వచ్చిందని అన్నారు. చరిత్ర తెలుసుకొని బీజేపీ నేతలు మాట్లాడాలని చెప్పారు.

కేటీఆర్ అరెస్ట్?

బీఆర్ఎస్ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిందని అన్నారు.  పదేళ్లలో కేసీఆర్, కవిత, హరీష్, కేటీఆర్ తెలంగాణ విగ్రహం మీద ధ్యాస ఎందుకు లేదు? అని నిలదీశారు. ఈ కార్ రేసింగ్ స్కాం లో నిధుల గోల్ మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారని అన్నారు. రేసింగ్ స్కాం లో కేటీఆర్ అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని కేటీఆర్ అరెస్ట్ తథ్యం అనే సంకేతాలు ఇచ్చారు. అయితే కేటీఆర్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు