Srisailam: శ్రీశైలం రోడ్లపై మరోసారి పెద్దపులి కనిపించడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. శ్రీశైలం, హైదరాబాద్ హైవే వట్టరపల్లి దగ్గర రోడ్డుపై పులి సంచారం చేస్తూ కనిపించింది. హైవేపై వెళ్తున్న ప్రయాణికులు ఈ దృశ్యాలను వీడియో తీశారు. అయితే ఆ ప్రాంతంలో రాత్రి పూట పులులు తిరగడం ఎక్కువగా తిరుగుతుంటాయి. అందుకని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ఆ రూట్లో రాత్రి ప్రయాణం చేయొద్దు భక్తులను హెచ్చరించారు.
Also Read: అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా
వారం రోజుల కిందట అచ్చంపేటలో
వారం రోజుల కిందట అచ్చంపేట సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం చేస్తూ కనిపించింది. అమ్రాబాద్‌లోని తిరుమలాపూర్ సమీపంలో రోడ్డుపై తిరుగుతూ స్థానికుల కంట పడింది. కాసేపు రోడ్డుపై తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది.
ఇది ఇలా ఉంటే గతంలో పాతాళగంగ దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వెనుక చిరుతపులి సంచరించింది. ఇంటి ప్రహరీ గోడపై నడుచుకుంటూ వెళ్లి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుతపులి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిరుత సంచారంతో స్థానికులతో పాటు శ్రీశైలంలో దైవ దర్శనానికి వెళ్లిన భక్తులు కూడా ఆందోళనకు చెందుతున్నారు. కాగా, పాతాళ గంగ ప్రాంతంలో చిరుత పులి ఇప్పటికే చాలాసార్లు కనిపించింది. మళ్లీ ఇప్పుడు దేవస్థానం ఏఈవో ఇంటి వెనుక కనిపించడంతో స్థానికులు టెన్షన్ పడుతున్నారు.
Also Read: దీపావళి ధమాకా.. బిగ్ బాస్ లో సెలెబ్రెటీల సందడి.. ప్రోమో చూసేయండి
మహానంది పుణ్యక్షేత్రంలోనూ
ఇటీవలే నంద్యాల జిల్లాలోని మహానంది దేవస్థానం వెనుక గోశాల ఆవరణలో చిరుత పులి సంచరించినట్లు దేవస్థానం అధికారులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు. మహానంది క్షేత్ర పరిసరాల్లో, గ్రామ శివార్లలో గత రెండు నెలలుగా చిరుత సంచారిస్తుండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
Also Read: Venkatesh: వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?