/rtv/media/media_files/2026/02/05/vijaya-reddy-2026-02-05-19-05-06.jpg)
Vijaya Reddy suicide case
Vijaya Reddy : ఇటీవల సంచలనం రేపిన చర్లపల్లి తల్లి-పిల్లల ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. గత 9 రోజులుగా పోలీసులకు సవాల్ గా మారిన ఈ కేసులో ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారించారు పోలీసులు. కొంతకాలంగా ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు గుర్తించారు పోలీసులు. విజయరెడ్డి డిప్రెషన్ కు గల కారణాలపై లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ వీడింది. డిప్రెషన్ (Depression)తోనే ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. కొంతకాలంగా ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు గుర్తించారు పోలీసులు. అయితే ఆమె డిప్రెషన్‌కు కారణాలపై కేసులో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి తల్లి మాటలను తూచా తప్పకుండా పాటించేలా పిల్లలు ఉండటంతో, ఆ కంట్రోల్‌తోనే వాళ్లను కూడా ఆమె తన వెంట తీసుకెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తల్లి ఏం చెబితే అది చేసేందుకు సిద్ధమై విజయారెడ్డితో కలిసి పిల్లలు కూడా జనవరి 30న రాత్రి హైదరాబాద్-ఘట్‌కేసర్ మార్గంలో చర్లపల్లి వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తల్లి చెప్పిందే చేయాలనే స్థితిలో ఉండబట్టే.. పిల్లలు ఆమెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు పోలీసులు. విజయారెడ్డి రెండో ఫోన్ వినియోగించారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు పోలీసులు.మరణానికి ముందు వారం రోజుల కాల్ డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు.
జనవరి 31న ఉదయం చర్లపల్లి- ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ డౌన్ లైన్ లో విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.విజయారెడ్డి బోడుప్పల్ హరితహారం కాలనీ వాసిగా గుర్తించారు పోలీసులు. విజయారెడ్డి కూతురు తన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. కూతురు ఇంటర్ సెకండియర్, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. విజయ రెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. కేసులో ఆమె పనిచేసే ఆఫీసులో 16 మందితో పాటు, బంధువులను విచారించగా ఎలాంటి అనుమానాస్పద లీడ్ దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు.
Follow Us