High alert in Hyderabad : భారీ పేలుడుతో ఉలిక్కిపడిన దేశ రాజధాని..హైదరాబాద్‌ లో హైఅలర్ట్‌

దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోనూ హై అలర్ట్ ప్రకటించారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

New Update
Hyderabad police high alert

Hyderabad police high alert

High alert in Hyderabad : దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్‌ 1 వద్ద పార్కింగ్‌ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పేలుడు నేపథ్యంలో ఎర్రకోటతో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో  హైఅలర్ట్‌ ప్రకటించారు. పేలుడు ధాటికి చుట్టుపక్కనే ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో పేల్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

హైదరాబాద్‌లో హై అలర్ట్‌ 

మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యింది. ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఆయా నగరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. కేంద్రం అలర్ట్‌తో ప్రధాన నగరాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేలుడుపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. ఉగ్రవాద చర్యలను తోసిపుచ్చలేమంటున్నారు. ఢిల్లీలో భారీ పేలుడు నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. రేపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే రాజధాని నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఉన్నప్పటికీ ఉగ్రచర్య నేపథ్యంలో భద్రతను మరింత పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో హై అలర్ట్‌ ప్రకటించింది. అనుమానిత వ్యక్తులు, అనుమానిత వస్తువులు, వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర సీపీ సజ్జనార్ సూచిస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరగవద్దని వీలయినంతవరకు ఇంటికి పరిమితం కావడం మంచిదని సూచిస్తున్నారు.

హైదరాబాద్ తో పాటు మిగతా ప్రాంతాల్లోనూ తనిఖీలు పెంచారు.  రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నగరంలోని పాతబస్తీలో విస్తృత తనిఖీలు చేపట్టారు.  రద్దీ ప్రాంతాల్లో వాహానాల తనిఖీలు, నాకాబంధీ నిర్వహించాలని నగర సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు జారీచేశారు.  సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. 

 ఢిల్లీ బాంబు పేలుళ్లతో హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించారు.చార్మినార్, గోల్కొండ కోట, మక్కా మసీద్, కోఠి, అబిడ్స్, గోకుల్ చాట్..లతో పాటు  అన్ని మెట్రో స్టేషన్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు కొనసాగు తున్నాయి. అనుమానాస్పదంగా వస్తువులు, బ్యాగులు, మనుషులు కనిపిస్తే డయల్ 100కి సమాచారమివ్వాలని కోరిన నగర సీపీ సజ్జనార్ కోరారు.

Advertisment
తాజా కథనాలు