Private Travels: ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు ఝలక్.. రంగంలోకి దిగిన తెలంగాణ రవాణా శాఖ

కర్నూలు బస్సు ప్రమాదంతో తెలంగాణ రవాణా శాఖ అలర్ట్ అయింది. ట్రావెల్స్ బస్సులపై ఫిట్‌నెస్, పర్మిట్, బీమా, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పత్రాలు లేని బస్సులను సీజ్ చేసి, చలాన్లు వసూలు చేశారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

New Update
Private Travels

Private Travels

Private Travels: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం(Kurnool Bus Incident) రాష్ట్రాలను కుదిపేసింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బస్సు బైక్‌ను ఢీకొట్టి 300 మీటర్ల దూరం లాక్కెళ్లడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. విచారణలో బస్సులో పలు సాంకేతిక లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది.

Hyderabad RTA Chekings 

శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు ట్రావెల్స్ బస్సులపై భారీ తనిఖీలు చేపట్టారు(Hyderabad RTA Chekings). డ్రైవర్‌ల డ్రంకన్ డ్రైవ్ చెకింగ్‌తో పాటు, బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, పర్మిట్ పత్రాలు, బస్సుల భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. పర్మిట్ లేకుండా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేసి, కొన్ని బస్సులను సీజ్ చేశారు. అలాగే కూకట్‌పల్లి, హయత్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కూడా ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లను పోలీసులు తనిఖీ చేశారు. లైసెన్స్ లేకుండా నడుపుతున్న డ్రైవర్లు, పత్రాలు లేని వాహనాలపై చర్యలు తీసుకున్నారు.

Private Travels Bus Checkings 

వాహనాలపై ఉన్న చలాన్లను వసూలు చేస్తున్నారు పోలీసులు. చలాన్లు చెల్లించిన తర్వాతే వాహనాలను వెళ్లనిచ్చే విధంగా కఠిన చర్యలు చేపట్టారు. ఈ చర్యలతో నగరంలో రవాణా నియమాల ఉల్లంఘనకు కొంతవరకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు మరింత విస్తృత స్థాయి తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు, వాహన ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, డ్రైవర్ల అనుభవం వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించనున్నారు. ఇందుకోసం ఆరు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి, ఈ తనిఖీలను పర్యవేక్షించనున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని బస్సుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

కర్నూలు ప్రమాదం వంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు నిబంధనలు కచ్చితంగా పాటించాలనే హెచ్చరిక జారీ చేసింది.

మొత్తం మీద, కర్నూలు ప్రమాదం తర్వాత తెలంగాణలో రవాణా శాఖ చర్యలు వేగవంతమయ్యాయి. ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇస్తూ అధికారులు పూర్తిస్థాయి తనిఖీలు కొనసాగిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు