BIG BREAKING: తెలంగాణలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దు.. ఈసీ సంచలన ప్రకటన!

తెలంగాణలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రద్దు చేసింది.

New Update
BREAKING

BREAKING

తెలంగాణలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిపిన హైకోర్టు జీవోతో పాటు ఎన్నికలపై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు గతంలో విడుదల చేసిన గెజిట్ ను రద్దు చేస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల కోడ్ కూడా ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు