కేసీఆర్‌కు టచ్‌లోకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మళ్లీ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు.. తమను BRSలోకి రానివ్వాలంటూ కేసీఆర్‌ను ఐదుగురు ఎమ్మెల్యేలు కోరానన్నది ఆ వార్త సారాంశం. అయితే.. ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని కేసీఆర్ తిరస్కరించినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. అయితే.. ఈ ప్రచారాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. ఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. BRS ఎమ్మెల్యేలు 20 మంది వస్తామంటే తామే వద్దంటున్నామన్నారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయిందన్నారు. కేసీఆర్ పేరు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడా వినపడటం లేదన్నారు. అసలు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్నాడా, లేడా? అన్న అనుమానాన్ని సైతం కోమటిరెడ్డి వ్యక్తం చేశారు.
రేవంత్‌కు బిగ్ షాక్..కేసీఆర్‌కు టచ్‌లోకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?
ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు టచ్ లో ఉన్నారని నేషనల్ మీడియాలో వార్త వచ్చిందన్నదని దాని సారాంశం. అయితే.. అది ఫేక్ అని తమతోనే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు.
New Update
Advertisment