తనను హత్య చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం చనిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ కాంప్రమైజ్ మాత్రం కానన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి తానే పంపించానని నిన్న సీఎం చెప్పారన్నారు. స్వయంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పంపించామని సీఎం చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు.
Also Read : మెగాస్టార్ కి సర్జరీ.. అసలేం జరిగింది??
రేవంత్ పై కేసు పెట్టాలి..
తనను ఎందుకు హత్య చేయాలని అనుకుంటున్నారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. రాష్ట్రంలో సమస్యలపై మాట్లాడుతున్నందుకే తనపై దాడులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైకి తమ వాళ్లే వెళ్లారని సీఎం చెప్పినా.. డీజీపీ, హోం సెక్రటరీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ను కలిసే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
సైబరాబాద్ సీపీ డైనమిక్ గా ఎందుకు పని చేయడం లేదని.. ఏసీపీ, సీఐపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎవరిని విడిచిపెట్టమన్నారు. ఒకరిని అరెస్టు చేసి మరొకరిని విడిచి పెట్టడం వీపు చింతపండు అయినట్లా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో నీ వీపు చింతపండు కాలేదా? అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ (Congress) లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తన ఇంటికి వాచ్చి కాళ్లు పట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి. తనను పీసీసీ చీఫ్ చేసేందుకు సహకరించాలని బతిమిలాడాడడన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రేసిడెంట్ ను చేసింది తానేనన్నారు. రేవంత్ రెడ్డిని గద్దెదించే వరకు పోరాటం చేస్తానన్నారు. రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ దగ్గర రూ.25 కోట్లు తీసుకుని ఎమ్మెల్యేగా ఈటెల గెలుస్తారని చెప్పాడని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే తాను బీఆర్ఎస్ లో చేరానన్నారు.
Also Read : ఏపీ, తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్!