రాయదుర్గంలోని ఒరియన్ విల్లాస్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర ఇంట్లోకి వెళ్లేందుకు ఎక్సైజ్ పోలీసుల ప్రయత్నం చేయగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు అడ్డుకున్నారు. పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారెంట్ లేకుండా ఇంట్లోకి ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
నిన్న ఓ ఫామ్ హౌజ్ పై దాడులు..
నిన్న రాత్రి ఓ ఫామ్ హౌజ్ లో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన అంశంపై శైలేంద్ర నివాసంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే.. అది ఫ్యామిలీ పార్టీ అని రాజకీయ కోణంలో పోలీసులు టార్గెట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ప్రభుత్వ కుట్ర అని ఫైర్ అవుతున్నారు.
రేవంత్ సర్కార్ అండతో “రాజ్ పాకాల” కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న పోలీసుల చర్యలు: - ఎమ్మెల్యే కెపి వివేకానంద్ @revanth_anumula @kpvivekanad @BRSparty@Congress4TSpic.twitter.com/mzWtPPzxvh
— The Politician (@ThePolitician__) October 27, 2024