/rtv/media/media_files/2025/01/31/4fVswU2ZRjyCQzsIIw8k.jpg)
supreme court Photograph: (supreme court)
పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే.. గడువు ముగిసినా ఈ అంశంపై నిర్ణయం తీసుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయ పడింది. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేపై దాఖలైన పిటిషన్లపై మరో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఏడుగురు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు ఇచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాఖలైన పిటిషన్లపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇందుకలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై వేటు ఖాయమన్న ప్రచారం సాగుతోంది.
బ్రేకింగ్ న్యూస్
— TNews Telugu (@TNewsTelugu) January 16, 2026
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ రెండు వారాలు వాయిదా
ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
లేదంటే తాము నిర్ణయం తీసుకుంటామన్న సుప్రీంకోర్టు ధర్మసానం https://t.co/9r7mR4AAHM
నేడు జరిగిన విచారణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వి హాజరై వాదనలు వినిపించారు. స్పీకర్ కు కంటి ఆపరేషన్ జరిగిందని న్యాయస్థానానికి తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారన్నారు. ఈ నేపథ్యంలోనే విచారణ, నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతుందని ధర్మాసనానికి వివరించారు. అయితే.. ఇప్పుడు ఇచ్చే సమయం ఫైనల్ అని కోర్టు స్పష్టం చేసింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. వారిపై ఫిరాయింపు ఎమ్మెల్యేపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని.. వారిపై అనర్హత వేటు వేయాలని గులాబీ నేతలు స్పీకర్ ను ఆశ్రయించారు. ఆయన నిర్ణయం తీసుకోవడం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్ణయం తీసుకునేందుకు ఒక సారి మూడు నెలలు, మరో సారి నాలుగు నెలలు గడువు ఇచ్చింది న్యాయస్థానం. ఆఖరి సారి గడువు గత నెల 19న ముగిసింది. అయినా.. ఇప్పటి వరకు ఏడుగురిపై మాత్రమే స్పీకర్ తీసుకున్నారు.
Follow Us