/rtv/media/media_files/2025/05/22/KFBCi83uuOF4C6UtWjtj.jpg)
Kavitha Letter To KCR
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన సభ గురించి లేఖలో ప్రస్తావించారు కవిత. బీజేపీ గురించి సభలో ఇంకా మాట్లాడితే బాగుండేదని లేఖలో పేర్కొన్నారు కవిత. ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యారని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పై మాట్లాడటం అందరికీ నచ్చిందని పేర్కొన్నారు కవిత. పర్సనల్ గా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవటం హుందాగా అనిపించిందన్నారు.
ఉర్దూ, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవటం బాధాకరమన్నారు. బీసీలకు 42 శాతం అంశాన్ని విస్మరించారని తండ్రికి గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. మీటింగ్ బాధ్యతలను పాత్ ఇన్ఛార్జిలకే అప్పగించడంతో తెలంగాణ ఉద్యమ కారులకు సదుపాయాలు కల్పించలేదని చాలా నియోజకవర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని పేర్కొన్నారు. పాత ఇంచార్జ్ ల ద్వారానే లోకల్ బాడీ ఎన్నికల్లో బీ ఫామ్ లు ఇస్తారన్న ప్రచారం సాగుతోందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు రాష్ట్ర పార్టీ మాత్రమే బీ ఫామ్ ఇవ్వాలని సూచించారు కవిత.
2001 నుంచి మీతో నడిచిన వారికి సిల్వర్ జూబ్లీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, గీం గురించి మెన్షన్ చేస్తారని ప్రజలు ఎదురు చూశారన్నారు. ఇంకా పంచ్ ఉంటుందని కేడర్ ఎదురు చూశారన్నారు కవిత. కానీ కేడర్, లీడర్లు అంతా మీటింగ్ తో సంతృప్తి చెందాన్నారు. పోలీసులకు వార్నింగ్ ఇవ్వడంపై కూడా కేడర్ లో హర్షం వ్యక్తం అయ్యిందన్నారు. బీజేపీ మీద కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలా మంది భవిష్యత్ లో ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటారన్న ఊహాగానాలను మొదలు పెట్టారన్నారు కవిత. తాను కూడా అదే కోరుకున్నానన్నారు. బీజేపీతో తాను ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తు చేశారు. జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ, ఎంఎల్ఏ స్థాయి లీడర్లు మీతో యాక్సెస్ దొరకడం లేదని బాధపడుతున్నారన్నారు. కేవలం కొంత మందిని మాత్రమే కలుస్తున్నారని ఫీల్ అవుతున్నారన్నారు. దయచేసి అందరినీ కలవాలని కోరారు కవిత.