/rtv/media/media_files/2025/06/25/telangana-local-elections-2025-06-25-12-57-03.jpg)
స్థానిక ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాలని పేర్కొంది. దీంతో మరో నెలన్నరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయమైంది. అయితే.. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎలా ముందుకు వస్తుందనే అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఇప్పటికే 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైల్ ఇప్పుడు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. అయితే.. త్వరలో చేపట్టనున్న జన గణనతో పాటు కుల గణన కూడా నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పట్లో బీసీ బిల్లుపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. మరో వైపు బీసీ రిజర్వేషన్లను పెంచాల్సిందేనని ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు రేవంత్ సర్కార్ స్థానిక ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లనుందనే అంశంపై చర్చ సాగుతోంది.
విద్యానగర్ ఆర్ కృష్ణయ్య గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు @RaoKavitha
— MANASA BRS (@ManasaBrs) June 22, 2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలి
ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా ఉద్యమాలే శరణ్యం… pic.twitter.com/BmjpkEnaUV
కేంద్రంపై ఒత్తిడి:
అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అఖిలపక్ష నేతలకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చే ఛాన్స్ ఉంది.
పార్టీ పరంగా రిజర్వేషన్లు:
ఒక వేళ కేంద్రం అంగీకరించకపోతే.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ తో పాటు అనేక మంది అగ్రనేతలు స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.