/rtv/media/media_files/2025/01/15/o4evDuU5bAXjsHWQaaX1.jpg)
Supreme Court Kunamneni sambashivrao
ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తనపై దాఖలైన ఎన్నికల అఫిడవిట్ పిటిషన్ ను రద్దుచేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. సుప్రీంకోర్టు కూనంనేని పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఎన్నికల అఫిడవిట్ కేసులో వాదనలు ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యే కూనంనేని సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫార్మ్ -26 ఎన్నికల అఫిడవిట్ లో సమగ్ర వివరాలు వెల్లడించలేదని కొత్తగూడెంకు చెందిన నందూలాల్ అగర్వాల్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఫార్మ్ 26 అఫిడవిట్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూనంనేని తన భార్య పేరును పేర్కొనలేద పిటిషన్ లో వెల్లడించాడు. ఇంకా లైసెన్స్ డ్ నోటరీతో అఫిడవిట్ చేయించలేదని ఎన్నికల పిటిషన్ లో పేర్కొన్నారు.