BIG BREAKING: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది.

New Update
BREAKING

BREAKING

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ ని ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈనెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చేనెల 11 న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై గత రెండు రోజులుగా కసరత్తు చేసింది. ఇంచార్జి మంత్రులు, నియోజకవర్గ నేతలతో చర్చించి నవీన్ యాదవ్ ఆ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్. జూబ్లీహిల్స్ టికెట్ కోసం అజారుద్దీన్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పోటీపడ్డారు. స్థానిక బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని భావించిన హైకమాండ్ నవీన్ యాదవ్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

 IMG-20251008-WA0017

Advertisment
తాజా కథనాలు