Big breaking: ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసుల నోటీసులు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో మాత్రమే బయటికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం కేటాయించిన 1+4 సెక్యూరిటీని సైతం వినియోగించాలని స్పష్టం చేశారు.

New Update
mla-rajasingh cases

mla-rajasingh cases

ఎమ్మెల్యే రాజా సింగ్ మంగళహాట్ పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం సెక్యూరిటీతో మాత్రమే బయటికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాజాసింగ్ భద్రత దృష్ట్యా ఇప్పటికే ప్రభుత్వం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తో పాటు 1+4 భద్రతను కేటాయించింది. అయితే రాజాసింగ్ తమ సూచనలను పట్టించుకోవడంలేదని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగించడం లేదని పోలీసులు చెబుతున్నారు. సెక్యూరిటీ లేకుండానే ఆయన బయటకు వస్తున్నారని అంటున్నారు. 

MLA Raja Singh

Advertisment
Advertisment
తాజా కథనాలు