MP Raghunandan Rao: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఒక లాయర్ వృత్తిలో ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సీజేకి లేఖ రాశారు. దీనిపై సుమోటో పిటిషన్ గా సీజే ధర్మాసనం స్వీకరించింది. ఇటీవల హైడ్రా హీరో నాగార్జున చెందిన ఎన్ కన్వేషన్ ను కూల్చివేయడంపై స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని కించపరిచేలా రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారని జడ్జి పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై రఘునందన్ రావు అగౌరవం కలిగి ఉన్నారని చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసు నమోదు...
కాగా హైకోర్టు సీజే ధర్మాసనం సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు రఘునందన్ రావుపై నమోదు చేసింది. న్యాయస్థాన్నాన్ని ధిక్కారాయించేలా చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సీజే ధర్మాసనం ఆయనకు నోటీసులు పంపింది. ఇటీవల హీరో నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేతలను ఆపాలంటూ.. హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
దీన్ని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం.. కూల్చివేతలపై స్టే ఇచ్చింది. వెంటనే కూల్చివేతలను ఆపేయాలంటూ అధికారులు ఆదేశాలు ఇచ్చింది. అయితే అప్పటికే అధికారులు ఎన్ కన్వేషన్ ను కూల్చివేశారు. కాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రఘునందన్ విమర్శలు చేయడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివరణ ఇవ్వాలంటూ నోటిసులు జారీ చేసింది.