Caste Census: కులం, మతం చెప్పనివారికోసం సెపరేట్ కాలమ్స్‌‌‌‌‌‌‌‌!

TG: కులగణన సర్వే ఫారాల్లో కులం, మతం చెప్పేందుకు ఇష్టపడని వారికోసం ప్రత్యేక కాలమ్స్ పెట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. మహమ్మద్‌‌‌‌‌‌‌‌ వహీద్ వేసిన పిటిషన్‌పై విచారణ చేసిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది.

New Update
high court 2

Caste Census: తెలంగాణలో ఈరోజు నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచే అధికారులు ప్రజల ఇంటికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అయితే కులగణనకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. కులగణన పేరుతో చేపట్టిన సర్వేలో కులం, మతం చెప్పని వారికోసం ప్రత్యేక కాలమ్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. 

Also Read :  ఫ్రిజ్‌లో ఈ సీక్రెట్‌ బటన్‌ ఇలా వాడితే... తాజా ఆహారం మీ సొంతం

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వేలో కులం, మతం చెప్పాలని అనుకోని వారి నుంచి వివరాల సేకరణకు ప్రత్యేక కాలమ్స్‌‌‌‌‌‌‌‌ పెట్టాలంటూ ఇచ్చిన వినతిపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ మహమ్మద్‌‌‌‌‌‌‌‌ వహీద్, కుల నిర్మూలన సంఘం ప్రధాన కార్యదర్శి డీఎల్‌‌‌‌‌‌‌‌ కృష్ణ హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మసం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 4కి వాయిదా వేసింది.

Also Read :  వాహనదారులకు షాక్.. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంతంటే!

ఉదయం నుంచి మొదలు...

కులగణన నేపథ్యంలో ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టనుంది రేవంత్ సర్కార్. ఈ నెల 8వరకు అంటే మూడు రోజుల పాటు ఇంటి సర్వే చేయనున్నారు. ఈ కులగణన చేసేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయుల సేవలను వాడుకోనున్నారు. మధ్యాహ్నం వరకు స్కూళ్లలో పాఠాలు బోధించి.. మధ్యాహ్నం నుంచి సర్వే చేయనున్నారు. కాగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులాల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కులగణన పూర్తి చేసేందుకు 30 రోజుల గడువు పెట్టింది. ఇందుకోసం 80 వేల మంది ఎన్యూమరేటర్ల నియమించింది. మండలాలవారీగా కంప్యూటరీకరణ చేయనున్నారు అధికారులు.

సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా... ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉండనున్నాయి. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉండనున్నాయి. ఇందులో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్, పుట్టిన తేదీ, విద్యార్హత, పలు వ్యక్తిగత వివరాలను అడుగుతారు. అలాగే పార్ట్ -2లో కుటుంబ ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన పలు ప్రశ్నలు అడుగుతారు. ముందుగా.. ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. కాగా ఈ సర్వేలో భాగంగా ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 ఇళ్లను కేటాయించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు